Begin typing your search above and press return to search.

కేసీయార్ స్లోగన్ అదే.. మోడీ సెంటిమెంట్ తోనే...?

By:  Tupaki Desk   |   22 Feb 2022 6:30 AM GMT
కేసీయార్ స్లోగన్ అదే.. మోడీ సెంటిమెంట్ తోనే...?
X
రాజకీయాల్లో కొత్త మార్పులు వచ్చాయి. ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం ఒక ఎత్తు. ఆల్ రెడీ చేసినవి ఉంటే వాటిని మార్కెటింగ్ చేసుకుని సక్సెస్ కావడం మరో ఎత్తు.

ముఖ్యంగా రోల్ మోడల్స్ ముందుకు పెడితే కధ విజయవంతం అవుతుంది. ఇలాంటి విషయాంలో మోడీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యారు. ఇపుడు కేసీయార్ కూడా అదే చేయాలనుకుంటున్నారు. తెలంగాణా మోడల్ ని ఆయన జాతీయ స్థాయిలో చూపించబోతున్నారు.

మేము తెలంగాణాను అభివృద్ధి చేశాము, అలాంటి ప్రగతి మీకు కావాలా అని దేశ ప్రజలను అడుగుతున్నారు. తెలంగాణాలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి, సాగు నీటి ప్రాజెక్టులను కట్టాం, రైతులకు మేలు చేశాం, ఇక బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో చేశాం, అలాంటి పనులు దేశవ్యాప్తంగా అమలు కావాల్సి ఉంది. అన్ని వనరులూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కేసీయార్ అంటున్నారు.

ఒక విధంగా బంగారు తెలంగాణాగా టీయారెస్ తెలంగాణాను తీర్చిదిద్దిందని, ఇపుడు అదే తరహాలో గోల్డెన్ ఇండియాగా చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. తెలంగాణాను పాలించలేరు అన్న వారికి అద్భుతంగా పాలించి చూపించామని, అలాగే రేపటి రోజున దేశానికి కూడా సరైన దిశా నిర్దేశం చేస్తామని అంటున్నారు.

అంతే కాదు కలసి వచ్చే పార్టీలతో దేశంలో కొత్త రాజకీయాన్ని కూడా తీసుకువద్దామని చెబుతున్నారు. ఒక విధంగా చూస్తూంటే కేసీయార్ పూర్తిగా మోడీ అడుగు జాడలలో నడుస్తున్నట్లుగా ఉంది.

మోడీ కూడా 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ ని తెర మీదకు తెచ్చారు. గుజరాత్ వెలిగిపోతోంది. అలాగే భారత్ కూడా వెలిగిపోవాలీ అంటే బీజేపీని గెలిపించాలి అని మోడీ ఇచ్చిన పిలుపు బీజేపీ భారీ విజయానికి కారణం అయింది.

ఇంకో వైపు చూస్తే గుజరాత్ మోడల్ మోడీ హయాంలో దేశమంతా విస్తరించిందా, అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందా అంటే జవాబు మాత్రం నిరాశగానే వస్తుంది.

అయినా సరే మోడీ హిట్ అయ్యారు. ఆయన మంచి వ్యూహకర్త, మాటకారి. ఆయనకు సరిజోడుగా నేషనల్ పాలిటిక్స్ సీన్ లోకి వస్తున్న కేసీయార్ కి వ్యూహాలు బోలెడు, అలాగే వాక్చాతుర్యం కూడా ఉంది. దాంతో ఆయన కూడా అచ్చం మోడీ మాదిరిగానే తెలంగాణా మోడల్ అంటున్నారు. మరి ఈ కొత్త స్లోగన్ కి జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.