Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహాల‌కు ఏపీ క‌లిసి వ‌స్తుందా..?

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:30 PM GMT
కేసీఆర్ వ్యూహాల‌కు ఏపీ క‌లిసి వ‌స్తుందా..?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాల‌కు.. ఏపీలో క‌లిసి వ‌చ్చేవారు ఉన్నారా? ఆయ‌న వేస్తున్న అడుగుల‌ను స‌మ‌ర్ధించేవారు ఉన్నారా? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర‌మై న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. కేసీఆర్ ను గ‌మ‌నిస్తే.. గ‌త కొన్నాళ్లుగా మ‌ళ్లీ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌వైపు దృష్టి పెట్టారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై యుద్ధం చేస్తాన‌ని.. ఆయ‌న ఢిల్లీ గ‌ద్దె నుంచి దింపే వ‌ర‌కు తాను నిద్ర పోయేది లేద‌ని..కొన్ని రోజుల కింద‌ట శ‌ప‌థం చేసిన కేసీఆర్‌.. రాష్ట్రంలో వ‌రి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంతో క‌య్య‌మేన‌ని సంకేతాలు పంపేశారు. ఈ క్ర‌మంలో అధికారంలో ఉండి కూడా ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కేసీఆర్‌.. కేంద్రంలో మోడీని గ‌ద్దె దింపే వ్యూహంపై అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తోనూ.. బిహార్ ప్ర‌తిప‌క్షంతోనూ.. ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. ఇంట‌గెలిచి.. అన్న‌ట్టుగా.. కేసీఆర్‌కు మ‌రో తెలుగు రాష్ట్రం, దాయాది రాష్ట్రం ఏపీలో ఏయే పార్టీలు క‌లిసివ‌స్తాయి? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఎందుకంటే.. ముందు.. త‌న సొంత రాష్ట్రాల్లో బ‌లం సంపాయించుకోకుండా.. జాతీయ‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేసినా.. కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్పవు. సో,.. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే పార్టీలు ఏవ‌నే చ‌ర్చ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఏపీ అధికార పార్టీ వైసీపీ విష‌యాన్ని తీసుకుంటే.. కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ స‌ర్కారుకు, బీజేపీ నేతల కు సానుకూలంగా ఉంది. పైగా.. కేసీఆర్‌కు స‌హ‌క‌రిస్తే.. ఆ రాష్ట్రంతో ఉన్న నీటివివాదాలు, విద్యుత్ బ‌కా యిల అంశాల‌పై.. మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. రాజ‌కీయంగా తెలంగాణ‌లో ఉనికి కోల్పోవ‌డానికి అక్కడి అధికార ప‌క్ష‌మే కార‌ణ‌మనే భావ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ పార్టీ కూడా కేసీఆర్‌ను సానుకూలంగా స్పందించ‌డం లేదు.

పైగా బీజేపీతో క‌లిసి పొత్తు పెట్టుకుని మ‌రోసారి ఏపీలో అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇక‌, జ‌న‌సేన విష‌యాన్ని తీసుకు న్నా.. బీజేపీతో ఇప్ప‌టికే ఈ పార్టీ పొత్తులో ఉంది. సో.. ప్ర‌ధాన పార్టీలు ఏవీ కూడా కేసీఆర్‌తో పొత్తుకు సిద్ధంగా లేవు. దీనిని బ‌ట్టి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలు.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేది ప్ర‌శ్న‌గానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.