Begin typing your search above and press return to search.
కొత్త ప్రయోగంతో నోరు మూయించనున్నకేసీఆర్
By: Tupaki Desk | 25 Sep 2015 9:35 AM GMTఎదుటోడు ఎంతటి వాడైనా సరే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక మాట్లాడటం ఒకసారి మొదలు పెట్టారంటే.. ఆయన తాను చెప్పాలనుకున్నది పూర్తయ్యేసరికి.. ఎదుట ఉన్నవాళ్లు కన్వీన్స్ అయ్యేలా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఈ విలక్షణతే కోట్లాది మంది తెలంగాణవాదుల్ని కదిలించి.. కొత్త రాష్ట్రం ఏర్పడేలా చేసిందని చెప్పొచ్చు.
తన మాటలతో అద్భుతాలు సృష్టించే కేసీఆర్.. తాజాగా అవే మాటలతో.. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారిన సమస్య నుంచి గట్టెక్కాలని చూస్తున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. సెలవులు పూర్తి అయిన వెంటనే.. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వారి వాదనకు భిన్నమైన రీతిలో తన వాదనను కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యలతో పాటు.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ విషయంలో అధికారపక్షం తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని విపక్షాలు ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో.. వారి వాదనలు తేలిపోయేలా చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సరికొత్త ప్రయోగం చేయనున్నారని చెబుతున్నారు.
దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా అసెంబ్లీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా అధికారుల్ని తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28న రైతుల ఆత్మహత్యలపై చర్చ అనంతరం.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ వ్యవహారంపై చర్చ జరిగే వీలుంది.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకోవటంతో పాటు..ప్రభుత్వ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం అసెంబ్లీ నాలుగు వైపులా పెద్ద పెద్ద తెరల్ని ఏర్పాటు చేసి.. అధికార.. విపక్ష సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు తన వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపించనున్నారు. ఎప్పటిలానే.. కేసీఆర్ తన వాదనతో అందరిని కన్వీన్స్ చేస్తారా..? తన మాటలతో కన్పీన్స్ చేసినా చేయకున్నా.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తొలి ముఖ్యమంత్రిగా మాత్రం రికార్డు సృష్టించటం మాత్రం ఖాయమంటున్నారు.