Begin typing your search above and press return to search.
హరీశ్ కు కేసీఆర్ భరోసా ఇచ్చారా..భయపెట్టారా?
By: Tupaki Desk | 11 Dec 2017 3:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తాజాగా వేసిన ముందడుగుపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. తన మేనల్లుడు అయిన సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో మంత్రి హరీశ్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, తమకు నీళ్లు అందిస్తారని నమ్మకంతో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో మంత్రి బాగా పనిచేశారని మెచ్చుకున్నారు. అదేవిధంగా పనులు పూర్తి గావడానికి కూడా మరింత కష్టపడాలని, పదిరోజులకోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ఆదేశించారు. అయితే కేసీఆర్ కామెంట్లపై విభిన్నమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇలా అనడం వెనుక వేరే ఉద్దేశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ - కేవలం హరీశ్ పైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారని చెప్పడంపై అధికార టీఆర్ ఎస్ పార్టీలో చర్చ మొదలైందని అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వంలోనూ - పార్టీలోనూ తనయుడు కేటీఆర్ పాత్రను పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు మొత్తం కేటీఆర్ చుట్టూ తిరిగింది. ఆ సమయంలో హరీశ్ రావు ఢిల్లీలో ఉండడం పలు విమర్శలకు తావిచ్చింది. దీనిపై కొంతమంది నేతలను అడుగుతున్న సమయంలో ఇలాంటివన్ని మమ్మల్ని ఎందుకు అడుగుతారని దాటవేశారు తప్ప, ఇందులో తప్పేముందని అడిగిన చెప్పినవారు లేరు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశానికి ఎత్తేయడం పట్ల కూడా పలువురు టీఆర్ ఎస్ నేతలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు భారాన్ని హరీశ్ రావుపై మోపడంతో అనేకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా ఏ రకంగా పూర్తవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులివ్వలేదని - సకాలంలో పూర్తికావడం ఎలా కుదురుతుందని అధికారులు అడుగుతున్నారు. ఎన్నికల నాటికి హరీశ్ పాత్రను పూర్తిగా తగ్గించేందుకే, ఆయనపై ఈ భారం మోపినట్టు కనిపిస్తున్నదని అధికారపార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థూలంగా కుటుంబవార్ కొత్త రూపం దాల్చిందని విశ్లేషిస్తున్నారు.