Begin typing your search above and press return to search.
కేటీఆర్ కోరికలు పెరిగిపోతున్నాయంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 12 Oct 2017 5:03 AM GMTటీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగంలో హాస్యం - రౌద్రం - విశ్లేషణ - వివరణ ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత భిన్నంగా ఉంటుంది కాబట్టే....కేసీఆర్ స్పీచ్ అంటే ప్రత్యర్థులు కూడా వినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఆయన భావాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా! తాజాగా కొత్త జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సిరిసిల్లలో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు గులాబీ దళపతి కేసీఆర్.
చేనేత కార్మికులకు లబ్ధి చేయాలనే ఉద్దేశంతోనే దసరాకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయితే బతుకమ్మ చీరలపై కూడా రాజకీయాలు చేశారని కేసీఆర్ మండిపడ్డారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. సిరిసిల్ల కార్మికులను బతికించాలని ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి కార్మికుడికి నెలకు రూ.185 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ప్రభుత్వ అవసరాలకు వినియోగించే వస్త్రాలను చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేసేలా తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన తనయుడైన మంత్రి కేటీఆర్ ను ప్రశంసల్లో గుప్పించారు.
`` మీ ఎమ్మెల్యే రామారావు బాగా హుషారయిండు.. సిరిసిల్ల నీళ్లు బాగానే పడ్డయి! జిల్లా ఏర్పాటు ప్రారంభించినప్పుడు మొదట సిరిసిల్లా జిల్లా ఇస్తే చాలు అన్నాడు....జిల్లా ఏర్పాటు చేశాం. ఇపుడు రెండు మూడు వందల కోట్లకు టెండర్ పెట్టిండు. అభివృద్ధి పనులు అంటున్నడు. చూస్తుంటే మీ నీళ్లు పడ్డట్లున్నాయి`` అని కేసీఆర్ తన తనయుడు అయిన స్థానిక ఎమ్మెల్యే - మంత్రి కేటీఆర్ ను చమత్కరిస్తూ ప్రశంసించారు. కేటీఆర్ కోరినట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 130 కోట్లు రేపే విడుదల చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ మరిన్నిఅంశాలపై స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు చనిపోతే తాము భిక్షమెత్తి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. రూ. వెయ్యి పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని ఒక్క తెలంగాణ ప్రభుత్వమే ఆ విధంగా ఆదుకుంటున్నదని తెలిపారు. రంగులు - రసాయనాలు - నూలుపై చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పవర్ లూమ్ కార్మికుల నుంచి ప్రభుత్వ పథకాలకు అవసరమయ్యే వస్ర్తాలు కొనుగోలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. బతుకమ్మ చీరల మీద ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేశాయని సీఎం అన్నారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులను ఆదుకునేందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినమన్నారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.