Begin typing your search above and press return to search.

మోడీని రామోజీని సర్ ఎంత‌గా పొగిడారంటే!

By:  Tupaki Desk   |   8 Jan 2016 1:01 PM GMT
మోడీని రామోజీని సర్ ఎంత‌గా పొగిడారంటే!
X
ఉద్య‌మ స‌మ‌యంలో మాట్లాడే మాట‌ల‌కు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసే వ్యాఖ్య‌ల‌కు.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చెప్పేదానికి ఎంత తేడా ఉంటుంద‌న్న‌ది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. తిట్టేట‌ప్పుడు ఎంత తీవ్రంగా తిడ‌తారో.. పొగిడేట‌ప్పుడు అంతే స్థాయిలో పొగిడేయ‌టం కేసీఆర్‌ కు మామూలే.

మొన్నామ‌ధ్య కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీని వేదిక మీద‌నే కాస్త ఘాటైన ప‌ద‌జాలంతో మాట్లాడిన కేసీఆర్‌.. తాజాగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో హిందీలో మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీని ఓ రేంజ్ లో పొగిడేశారు. ప్ర‌ధాని మోడీ ప్ర‌గ‌తిశీల ప్రధాన మంత్రి అని.. ఆయ‌న నేతృత్వంలో షురూ అయిన నీతి అయోగ్ అద్భుత‌మంటూ పొగ‌డ్త‌ల మీద పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. సంస్క‌ర‌ణ‌ల ప్ర‌ధానిగా అభివ‌ర్ణించారు.

శుక్ర‌వారం రామోజీ ఫిలింసిటీలో నిర్వ‌హించిన అఖిల భార‌త బిల్డ‌ర్ల స‌మావేశంలో మాట్లాడిన ముఖ్య‌మంత్రి.. బిల్డ‌ర్లు అంటే కాంట్రాక్ట‌ర్లు మాత్ర‌మే కాద‌ని.. జాతి నిర్మాణంలో భాగ‌స్వామ్యుల‌ని పేర్కొన్నారు. తెలుగు బిల్డ‌ర్లు జాతీయ స్థాయిలోనే కాదు.. అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించార‌న్నారు.

ఇటీవ‌ల ఆఫ్ఘానిస్తాన్ పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మించింది శీన‌య్య అండ్ కంపెనీ అంటే.. అది మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణంగా కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు హాజ‌రైన ఈ స‌మావేశంలో మ‌రో విశేషం కూడా చోటు చేసుకుంది. ఈ స‌ద‌స్సుకు వేదిక అయిన రామోజీ ఫిలింసిటీని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. రామోజీ సిటీని జ్యూయ‌ల్ ఆఫ్ హైద‌రాబాద్ గా కీర్తించేశారు. ఒకే వేదిక మీద గ‌తంలో త‌న‌దైన శైలిలో విమ‌ర్శించిన ఇద్ద‌రిని ఒకేసారి పొగిడేయ‌టం కాస్తంత విశేష‌మే.