Begin typing your search above and press return to search.
2019 ఫలితాలను చెప్పేసిన కేసీఆర్
By: Tupaki Desk | 9 March 2017 1:49 PM GMTఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకుగానూ టీఆర్ ఎస్ పార్టీకి 101-106 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. కొందరు పనితీరు బాగాలేకపోయిన వారికి సున్నితంగా హెచ్చరించారు. కాగా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారని.. ఆ సర్వే ప్రకారం సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తేలిందని టీఆర్ ఎస్ పార్టీలో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో ఈ సర్వే ఆధారంగానే కేసీఆర్ టికెట్లు ఇస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్వే వివరాలు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమావేశాలకు వచ్చే ముందు అన్ని అంశాలపై అవగాహనతో రావాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే మంత్రులు అరగంట ముందే అసెంబ్లీకి చేరుకోవాలని సీఎం పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/