Begin typing your search above and press return to search.
బాబు ముందే కేసీఆర్ నంద్యాల లెక్క చెప్పారే!
By: Tupaki Desk | 16 Aug 2017 10:04 AM GMTనిజమే... ఇప్పుడు తెలుగు నేలలో ఎక్కడ చూసినా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కూడినా... నంద్యాలలో ఎవరు గెలుస్తారన్న చర్చ తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. అంటే నంద్యాల బైపోల్స్ ఏ స్థాయిలో హీట్ పెంచిందో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ ఎన్నికపై ఇటు ఏపీ ప్రజలే కాకుండా... అటు తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారన్న వాదనలో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలోని మెజారిటీ మంది చర్చలో విపక్ష వైసీపీదే గెలుపు అన్న దిశగా చర్చ జరుగుతోంది. మరి తెలంగాణలో ఏ తరహా చర్చ జరుగుతోందన్న విషయానికి వస్తే... అక్కడ కూడా వైసీపీదే గెలుపు అన్న మాటే పెద్దగా వినిపిస్తోంది.
ప్రస్తుతం నంద్యాలలో ప్రచారం హోరెత్తుతున్న కీలక తరుణంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం విందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు - కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహా ఇరు రాష్ట్రాల మంత్రులు - కీలక నేతలు - ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తో ఇద్దరు చంద్రళ్లు దాదాపు గంటన్నర మేర చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా బయట పిచ్చాపాటిగా కూడా వారిద్దరు చర్చించుకున్న వైనం కూడా నిన్న కనిపించింది. మరి ఇద్దరు చంద్రుళ్ల మధ్య కూడా నంద్యాల ఎన్నిక ప్రస్తావన వచ్చిందా? అని కూడా జనం ఆసక్తికరంగా ఎదురు చూశారు. సమకాలీన రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతున్న అంశాలపై ఆయా పార్టీలకు చెందిన అధినేతల చర్చల్లోనూ ప్రస్తావన తప్పకుండా వస్తున్న ప్రస్తుత తరుణంలో నంద్యాల బైపోల్స్ అంశం కూడా ఇద్దరు చంద్రుళ్ల మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని తనకు తానుగా చంద్రబాబే ముందుగా ప్రస్తావించారట. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీతో పాటు తనపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాస్తంత సానుభూతిని కూడగట్టే యత్నం చేశారట. అంతేకాకుండా జగన్ ఎన్ని చేసినా... నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీనే విజయం వరిస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారట. అయితే చంద్రబాబు చెప్పిన దానినంతా ఓపిగ్గా విన్న కేసీఆర్... ఆ వెంటనే ఓ బాంబు లాంటి మాటను పేల్చారట. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారట కదా... అక్కడ వైసీపీదే విజయమని చెబుతున్నారే అని చంద్రబాబు ముందే అన్నారట. అయినా చంద్రబాబు ఏమనుకుంటారోనన్న భావన ఏమాత్రం లేకుండానే కేసీఆర్ ఆ వ్యాఖ్య చేశారట. కేసీఆర్ వ్యాఖ్య విన్న వెంటనే చంద్రబాబు ముఖం వాడిపోయిందని కూడా అక్కడున్న వారు చెబుతున్నారు. ఏకంగా మీ పార్టీ అభ్యర్థి ఓడిపోతారన్న కామెంట్ ను... మీ అభ్యర్థి బాగా బలహీనంగా ఉన్నారు కదా అంటూ కాస్తంత పరోక్షంగా వ్యాఖ్యానించడంతో చంద్రబాబు కంగుతిన్నారట.