Begin typing your search above and press return to search.
రోజూ ప్రెస్ మీట్ అని చెప్పి.. మూడో రోజు మిస్ అయిన కేసీఆర్?
By: Tupaki Desk | 10 Nov 2021 1:30 PM GMT‘‘మాటంటే మాట. మాట తప్పితే తల కాయ మీద మెడకాయ ఉండదు. నేను చెబుతున్నా కదా’’.. అంటూ మస్తు మాటల్ని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు తాను చెప్పిన మాటల మీద నిలబడింది లేదు. రెండు రోజుల క్రితం హటాత్తుగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయిన ఆయన.. బండి సంజయ్ ను మాటల తో ఉతికి ఆరేయటమే కాదు.. తీవ్ర పదజాలంతో ఎంతలా విరుచుకుపడ్డారో తెలిసిందే.
అలాంటి ఆయన.. ఇక పై రోజూ ప్రెస్ మీట్ పెడతా.. మీతో (విలేకరుల్ని ఉద్దేశించి) నిత్యం నేనే మాట్లాడతా.. ఇక వదిలేది లేదంటూ.. ఎంతలా ఫైర్ అయ్యారో.. ఆది.. సోమవారాల్లో తెలుగు ప్రజలంతా చూశారు. ముచ్చటగా మూడో రోజు కూడా ప్రెస్ మీట్ ఉంటుందని భావించిన మీడియాకు ఆయన ఊహించని రీతిలో షాకిచ్చారు. వాస్తవాని కి రోజూ ప్రెస్ మీట్ అంటూ ఆదివారం చెప్పినప్పుడు ఆయన మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్న లేదు. ఇలాంటి మాటల్ని కేసీఆర్ మస్తు చెబుతారు. చేతల్లో కి వచ్చేసరికి అలా చేయాలి కదా? అన్న ప్రశ్నలు వినిపించాయి.
అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా సోమవారం సాయంత్రం మరోసారి ప్రెస్ మీట్ పెట్టి విస్మయానికి గురయ్యారు. ఆ సందర్భంగా కూడా ఇకపై తాను నిత్యం ప్రెస్ మీట్ పెడుతానని చెప్పారు. రోటీన్ కు భిన్నంగా కేసీఆర్ మాట మీద నిలబడతారన్న భావన వ్యక్తమైంది. మరో రెండు.. మూడు రోజుల పాటు కేసీఆర్ ప్రెస్ మీట్లు ఉంటాయని భావించిన మీడియా ప్రతినిధులకు ఆయన నిరాశకు గురి చేశారు. అంచనాలకు భిన్నంగా స్పందించే ఆయన తీరుకు తగ్గట్లే.. ఈ రోజు (మంగళవారం) ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు.ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది.
దీనికి ఒక్కొక్కరు ఒక్కో మాటను చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ.. దానికి సంబంధించిన కసరత్తులో బిజీగా ఉంటారని చెబితే.. గడిచిన రెండు రోజుల్లో తాను చెప్పాల్సిన విషయాల్ని చెప్పేయటంతో.. చెప్పేందుకు ఏమీ లేకనే ఆయన మూడో రోజున ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోవచ్చన్న మాటను చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. ఏ రోజైనా కేసీఆర్ తాను చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఈ రోజు నిలబడటానికి అంటూ పాత పురాణాన్ని షురూ చేశారు. మొత్తంగా చూసినప్పుడు.. తానెంత సీరియస్ గా చెప్పే విషయమైనా.. క్రమ తప్పకుండా చేయటం కేసీఆర్ కు సాధ్యం కాదని చెబుతున్నారు. మరి.. డైలీ ప్రెస్ మీట్ అని చెప్పిన కేసీఆర్.. అలా ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నకు ఆయనేం చెబుతారో? ఇంతకీ.. ఆయన్ను ఆ ప్రశ్నను సంధించే ధైర్యం ఏ సీనియర్ రిపోర్టర్ కైనా ఉందంటారా?