Begin typing your search above and press return to search.
కరోనా వేళ.. చుట్టూ అంత మంది అవసరమా సారూ?
By: Tupaki Desk | 25 March 2020 9:30 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో మీరో అలవాటును గుర్తించారా? ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం చాలా తక్కువ. కరోనా పుణ్యమా అని.. తరచూ ఆయన మాట్లాడాల్సి వస్తోంది. వైరస్ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ఆయనే నేరుగా రంగంలోకి దిగటం తెలిసిందే. చెప్పాల్సింది చాలా కీలకమైన విషయం కావటం.. తాను తప్పించి మరెవరూ డీల్ చేసే అవకాశం లేకపోవటంతో.. అనివార్యంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.
ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా సరే.. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. తాను కూర్చున్న రెండువైపులా.. వెనుక కూడా పెద్ద ఎత్తున మంది ఉండేలా చూసుకుంటారు. అలా అని కూర్చున్నోళ్ల నోటి నుంచి ఏమైనా మాట వస్తుందా? అంటే ఒక్క ముక్క రాదు. ఎవరికి వారు కూర్చోవాలి.. సారు మాట్లాడేది వింటూ ఉండాలంతే. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అధినేతల్లో ఇలాంటి లక్షణం పెద్దగా కనిపించదు. కానీ.. కేసీఆర్ మాత్రం ఈ విధానాన్ని అమలు చేస్తుంటారు.
ఎందుకిలా అంటే.. తన వెంట చాలామంది ఉన్నారన్న భావన కలుగజేయటంగా చెబుతారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. విడి రోజుల్లో తాను నిర్వహించే మీడియా సమావేశాలకు చుట్టూ మంత్రులు.. పార్టీ నేతల్ని ఉంచుకునే ముఖ్యమంత్రి.. గడిచిన కొద్ది రోజులుగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లలో పార్టీ నేతలతో పోలిస్తే.. పోలీసు.. ఉన్నతాధికారులే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. విడి రోజుల్లో ఇలాంటి సీన్ చాలా తక్కువగా కనిపిస్తుంది.
ఇక్కడ పాయింట్ ఏమంటే.. కరోనా వేళ.. సామాజిక దూరం చాలా అవసరం. కనీసం మీటరు నుంచి మూడు మీటర్ల దూరాన్నిపాటించాల్సి ఉంటుంది. ఇక.. సీఎం లాంటి అత్యుత్తమ స్థాయిలో ఉన్న వారు.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. విడిరోజుల్లో చుట్టూ మందిని ఉంచుకునే అలవాటున్న కేసీఆర్.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కరిగానే మాట్లాడితే మంచిదని చెబుతున్నారు. మరీ కావాలనుకుంటే.. ఒక పక్కగా.. దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా వేళ.. అందరికి సలహాలు.. సూచనలు ఇచ్చే కేసీఆర్ తనకు తానుగా పాటించాల్సిన అంశాల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.