Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను కరోనా ఎంత ఛేంజ్ చేసేసిందంటే?

By:  Tupaki Desk   |   25 March 2020 2:30 PM GMT
కేసీఆర్ ను కరోనా ఎంత ఛేంజ్ చేసేసిందంటే?
X
అది తెలంగాణ ఉద్యమం కావొచ్చు.. మరొకటి కావొచ్చు. విపక్ష నేతగా ఉన్నప్పుడు.. అధికారపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నప్పుడు.. మరే సందర్భంలోనైనా సరే.. కేసీఆర్ తీరును మార్చే సత్తా ఎవరికి లేదనే చెప్పాలి. ఆయనకంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఆయన తీరు ఉంటుంది. మరింత వివరంగా చెప్పాలంటే.. తన అలవాట్లను ఏ సందర్భంలోనూ మార్చుకోని కేసీఆర్.. ప్రాణాంతక కరోనా కారణంగా ఆయన మొత్తంగా మారిపోయారని చెబుతున్నారు.

కేసీఆర్ పొలిటికల్ కెరీర్ మొత్తంలోనూ చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారని చెబుతున్నారు. చిన్నస్థాయి నేత మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరేళ్ల పాటు పదవిని చేపట్టిన వేళలోనూ.. పది రోజుల వ్యవధిలో వరుస పెట్టి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టిన తొలి సందర్భం ఇదేనని చెబుతున్నారు.

సంక్షోభ సమయంలోనూ.. సంపూర్ణ అధిక్యత వేళలో.. ఏ టైంలోనూ వరుస పెట్టి మీడియా సమావేశాలు నిర్వహించే తీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకం. రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నికలు చాలా కీలకం. అలాంటివేళలోనూ వేళ్ల మీద లెక్క పెట్టేటన్నిసార్లు మాత్రమే మాట్లాడే ఆయన.. అందుకు భిన్నంగా కరోనా వేళ.. వరుస పెట్టి మీడియా సమావేశాల్ని నిర్వహిస్తున్నారు.

సారు తీరును పూర్తిగా మార్చేయటమే కాదు.. ఏళ్లకు ఏళ్లుగా ఫాలో అవుతున్న అలవాట్లను కరోనా మార్చేసిందని చెప్పాలి. స్వల్ప వ్యవధిలో ఇన్ని ఎక్కువసార్లు మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యింది ఇదే తొలి సందర్భంగా చెబుతున్నారు. ఏ సందర్భంలో కూడా తన తీరును మార్చుకోవటానికి ఇష్టపడని కేసీఆర్.. కరోనా వేళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.