Begin typing your search above and press return to search.
ఆ నలుగురికి భారీ భద్రత కల్పించిన కేసీఆర్
By: Tupaki Desk | 5 Nov 2022 6:30 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఆ నలుగురిని కేసీఆర్ అక్కున చేర్చుకున్నాడు. కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇటీవల స్వయంగా మీడియా ముందుకు వచ్చి బీజేపీ ఇలా కొనుగోళ్లు చేపట్టిందని వీడియోలు చూపించి మరీ ఎండగట్టిన కేసీఆర్ ఇప్పుడు ఇందులో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించారు. ఆ వీడియోలు బయటకు రావడంతో వారి ప్రాణాలకు ముప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు.
ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రుల స్తాయిలో భద్రతను కల్పించనున్నారు. నలుగురికి 4 ప్లస్ 4 గన్ మెన్లను కేటాయించారు. హైదరాబాద్ లోని నివాసంతోపాటు సొంత నియోజకవర్గంలోనూ భద్రత కల్పిస్తారు.
దీంతోపాటు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో బీజేపీ పరువు పోయేలా వీడియోలు ఉండడం.. అందులో ఈ నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉండడం.. ఇక వీరే ప్రధాన సాక్ష్యులుగా ఉండడంతోపాటు అన్ని సుప్రీంకోర్టులు, హైకోర్టులకు కేసీఆర్ వీడియోలు పంపడడంతో వీరికి సెక్యూరిటీ అవసరం అని కేసీఆర్ సర్కార్ ఈ మేరకు ఏర్పాటు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.