Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటల్లోనే మంత్రి పదవులా..?
By: Tupaki Desk | 7 July 2015 5:31 AM GMTనిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో 18 మంది మంత్రులు ఉండాలి. ఇప్పటికే ఉండాల్సిన సంఖ్యలో మంత్రులు ఉన్నారు. అయితే.. తాజాగా కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే. దీనికి నెల ముందు సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్‌ను సైతం క్యాబినెట్‌లో తీసుకుంటానని ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు.
ఇక.. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత.. పార్టీకి గుడ్‌బై చెప్పేసి కారు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి ఇస్తానన్న హామీ మీదన పార్టీలోకి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. డీఎస్‌తో పాటు మరికొందరు నేతలు కూడా పార్టీలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే వారి గురించి వదిలేస్తే.. ఇప్పటికి ఉన్న కమిట్‌మెంట్ ప్రకారం ముగ్గురికి క్యాబినెట్‌లో స్థానం కల్పించాల్సి ఉంటుంది.
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి.. ఇప్పటికే క్యాబినెట్‌లో ఉన్న వారిని తొలగించి.. కొత్తవారికి అవకాశం ఇవ్వటం.. రెండోది.. మాటలకు మాత్రమే మంత్రి పదవుల హామీల్ని పరిమితం చేయటం. కేసీఆర్ లాంటి నేత.. మొదటి దాని కంటే రెండో విధానాన్ని అనుసరించటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఎందుకంటే.. ఆయన బహిరంగంగా ఏదైనా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవటం అన్నది కేసీఆర్ గతాన్ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలైన స్వామిగౌడ్.. శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పి.. స్వామిగౌడ్‌ను మండలి ఛైర్మన్ చేయటం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ సంగతి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేసీఆర్ లాంటి నేత ఒక విలక్షణమైన వైఖరితో వ్యవహరిస్తుంటారు. తాము చేతల్లో చేయలేని పనుల్ని మాటలతో చెప్పి ఊరుకుంటారు. కేసీఆర్ గత పదమూడు నెలలుగా ఇచ్చిన హామీల్ని చూడండి. ఆయన పెద్దఎత్తున చేస్తానని చెప్పిన దేన్ని చేయటం కనిపించదు. ఇదే మాటకు చిన్నచిన్నగా కనిపించే కొన్ని ఉదాహరణల్ని చూస్తే విషయం అర్థం అవుతుంది.
ఉద్యోగాల నోటిఫికేషన్.. వేలాది పోస్టులు అక్కర్లేదు.. పట్టుమని పాతిక పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వేసి మొదలు పెట్టచ్చు కదా? తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన జర్నలిస్టులకు ఇప్పటికే హెల్త్‌కార్డులు ఇష్యూ చేయలేదు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సంగతి తెలిసిందే.
ఇలా.. చాలా చిన్న చిన్నఅంశాలుగా కనిపించే వాటినే నెరవేర్చని కేసీఆర్.. తాను నెరవేర్చలేని అంశాల్ని బహిరంగంగా చేస్తానని చెప్పటం ద్వారా.. తాను ఇచ్చిన హామీల్ని మర్చిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంటారే తప్పితే.. వాటిని అమలు చేయటం మాత్రం కనిపించదు. కొప్పుల ఈశ్వర్.. రసమయి బాలకిషన్ లాంటి వారికి మంత్రి పదవులు కూడా ఇదే రీతిలో ఉంటాయన్న వాదన వినిపిస్తోంది.