Begin typing your search above and press return to search.
జానా మీద పంచ్ లు సరే.. మన సంగతేంది సారూ?
By: Tupaki Desk | 2 Aug 2021 11:34 AM GMTమాట ఇవ్వటం.. తప్పటం రాజకీయాల్లో మామూలే. అయితే.. మాట తప్పిన వారిని ఎటకారం చేసే పెద్ద మనిషి తన వరకు సుబ్బరంగా ఉండాల్సిన అవసరం ఉంది. తాను మాత్రం ఇచ్చిన హామీల్ని తుంగలోకి తొక్కొచ్చు కానీ.. ఎదుటి వారు ఇచ్చిన మాటల్ని గుర్తు చేసి ఎగతాళి చేయటం అంత సబబుగా ఉండదు. ఇప్పుడు అలాంటి పనే చేసి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమ సమయం నుంచి తన రాజకీయ ప్రత్యర్థులపై పరుష వ్యాఖ్యలు చేయటం.. రాజకీయ శత్రుత్వం ఉన్న వారిపై దారుణ రీతిలో వ్యాఖ్యలు చేయటం మామూలే.
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మనిషి.. పాత తరహా రాజకీయాలకు చివరి తరం ప్రతినిధిగా పలువురు అభివర్ణించే సీనియర్ నేత జానారెడ్డిపై తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంత సబబుగా లేవంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే జానారెడ్డి ఎంత పవర్ ఫుల్ గా ఉంటారన్నది తెలిసిందే. రాజకీయాల్లో అధికారంలో ఉండటం.. అధికారాన్నిచేజార్చుకోవటం అన్నింటిని కాలం డిసైడ్ చేస్తుంటుంది. తెలంగాణ సాధన కోసం జానారెడ్డి సలహాలు.. సూచనల కోసం ఇదే కేసీఆర్ పదే పదే వారిని సంప్రదించటం తెలిసిందే. పాత విషయాల్ని మర్చిపోతారో.. బలవంతుడు బలహీనుడైన వేళ.. మరింత బలహీనం చేయాలన్న రాజకీయ వ్యూహమో కానీ.. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న ఆయనపై తాజా హాలియాలో నిర్వహించిన సభలో మరోసారి ఎటకారం ఆడేశారు.
రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో తాను రెండేళ్లలో కరెంటు వ్యవస్థను మంచిగా చేసి.. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెబితే నాడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన జానారెడ్డి ఎగతాళి చేశారని.. రెండేళ్లు కాదు.. 20 ఏండ్లు అయినా పూర్తి చేయలేరని జానారెడ్డి మాట్లాడారని.. ఇప్పుడు ఆయన ఏమంటారన్నారు. తాను రెండేళ్లలో పూర్తి చేస్తే తాను గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫు ప్రచారం చేస్తానని చెప్పారన్న కేసీఆర్.. ''కానీ ఈ పెద్ద మనిషి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే అతి పెద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందన్నారు. జానారెడ్డిని ఇంతలా విమర్శిస్తున్న ఇదే కేసీఆర్.. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళిత సీఎం ఉంటారని వ్యాఖ్యానించటం తెలిసిందే.
తాను మాట తప్పనని.. ఆరు నూరైనా.. నూరు ఆరైనా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళిత వర్గానికి చెందిన నేతనే ఏర్పాటు చేస్తామని.. లేదంటే తన తలను నరుక్కుంటానన్న కేసీఆర్ ఏం చేశారో అందరికి తెలిసిందే. కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని చెప్పి చేయనందుకే అంతలా మాటలు అంటే.. తల నరుక్కుంటానని మాట ఇచ్చి మరీ కేసీఆర్ చేసిన పనికి ఇంకేమనాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మాట అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు పెద్ద సారూ?