Begin typing your search above and press return to search.
ఆంధ్ర రాజధానిలో తెలంగాణ సీఎం
By: Tupaki Desk | 22 Oct 2015 5:39 AM GMT తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ కాలం తరువాత ఆంధ్రలో అడుగుపెట్టారు. కొద్దిసేపటి కిందటే ఆయనే ఏపీ రాజధాని అమరావతిలో దిగారు. ఆయనతో పాటు తలంగాణ మంత్రులు మహమూద్ అలీ - జగదీశ్వరరెడ్డి - ఈటెల రాజేందర్ వచ్చారు.
కేసీఆర్ బుధవారం రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేటలో జగదీశ్వరరెడ్డి ఇంట్లో బస చేశారు. అక్కడి నుంచే అమరావతికి ఆయన హెలికాప్టర్లో బయలుదేరి వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి సభవేదిక వరకు కేసీఆర్ కు ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
కాగా శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు గంటల పదిహేను నిమిషాలు ఉంటారు. గం.10.45 నిమిషాల నుంచి గం.2.00 వరకు ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో ఉంటారు. అమరావతికి వెళ్లేందుకు గాను సీఎం కెసిఆర్ బుధవారం రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేటకు రోడ్డు మార్గాన చేరుకున్నారు. ఆయనకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టరు సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ స్వాగతం పలికారు. జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు.
కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి నుంచి బయల్దేరి 2.30కి సూర్యాపేటకు చేరతారు. గొల్లబజార్‌లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 4 గంటలకు హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా ఎర్రవెల్లి చేరతారు. అక్కడ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆరు గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి నర్సన్నపేటకు చేరతారు. 6.10కి ఇళ్ల శంకుస్థాపనలో పాల్గొంటారు. ఏడు గంటలకు అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరతారు.
Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx