Begin typing your search above and press return to search.
బాబు నోట ఆ మాట రాగానే కేసీఆర్ రియాక్షన్?
By: Tupaki Desk | 12 Oct 2015 5:17 AM GMTఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ.. శుభలేఖ ఇస్తానని.. శంకుస్థాపనకు ఆహ్వానిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో ప్రకటించటం తెలిసిందే.
టీవీల్లో లైవ్ వచ్చిన ఈ మాటలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెవిన ఎప్పుడు పడ్డాయి? బాబు మాటలకు కేసీఆర్ ఇచ్చిన రియాక్షన్ ఏంది? ఆయనేం అన్నారు లాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర విషయాలు తెలిసాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఏపీ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాన్ని తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం పలుకుతానని చెప్పిన వెంటనే కొద్ది నిమిషాలకే ఈ విషయాన్ని కేసీఆర్ చెవిన వేశారు.
బాబు చెప్పిన మాటల్ని విన్న కేసీఆర్.. వెంటనే స్పందిస్తూ.. శంకుస్థాపన ముహుర్తం ఎన్ని గంటలకు అని అడిగినట్లుగా చెబుతున్నారు. బాబు నోట వెంట ఆహ్వానం మాట విన్న తర్వత.. కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాట ఇదేనని చెబుతున్నారు. ముహుర్తం గురించి వివరాలు అడిగిన ఆయన.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారని చెబుతున్నారు. శంకుస్థాపనకు వెళదామని కానీ.. తర్వాత చూద్దామని కానీ చెప్పకుండా.. ముహుర్త సమయం విని ఉండిపోయారని.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు. ముహుర్తం ఎన్నిగంటలకు పెట్టారు..? ఏ లగ్నంలో అయి ఉంటుందన్న ఆసక్తితో ప్రశ్నించారా? లేక.. తనకు వెళ్లే వెసులుబాటు ఉంటుందా? లేదా? అన్నది చెక్ చేసుకోవటానికి అడిగారా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేని పరిస్థితి. అయితే.. రానున్న రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.