Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాన్ని న‌లిపేసే వ్యూహ‌మా?

By:  Tupaki Desk   |   14 July 2018 10:40 AM GMT
ప్ర‌తిప‌క్షాన్ని న‌లిపేసే వ్యూహ‌మా?
X
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రంలోనూ ముందుగా ఎన్నికలు వస్తే అందుకు పూర్తి స్దాయిలో సిద్దమయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్దతో లోపాయికారీగా సర్వే చేయిస్తున్న కేసీఆర్ అభ్యర్దుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం జరిగిన పార్టీ ప్లీనరీలో సిట్టింగ్ ఎంఎల్ ఎల అందరికి సీట్లు ఖాయమని ప్రకటించారు. అయితే ఇటీవల కొందరి ఎంఎల్ ఎల పనితీరు - అవినీతి ఆరోపణలు రావడంతో వారిలో కొందరిని మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సిట్టింగ్ ఎంఎల్ ఎలతో పాటు ప్రతిపక్ష ఎంఎల్ ఎల స్దానాలపై కూడా ద్రుష్టి సారించినట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా అధ్యక్షులు - మండల - గ్రామస్దాయి నాయకులతో చర్చిస్తున్నట్టు సమాచారం. అందరి అభిప్రాయాల మేరకు అభ్యర్దులను నిర్ణయించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల వేడి పుట్టించి ప్రతిపక్షాలను గందరగోళపరచాలని కేసీఆర్ వ్వూహం. అభ్యర్దుల ఎంపిక పూర్తిచేసి తొలివిడతగా ఒక జాబితా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా జరిగితే ప్రతిపక్ష పార్టీలో కూడా కాక పుడుతుందని కేసీఆర్ వ్యూహం. టిఆర్ ఎస్ ఎంఎల్ ఎల జాబితాను చూసి అభ్యర్దుల ఎంపికలో ప్రతిపక్షాలు కూడా నిమగ్నమవుతాయని, దాని ద్వారా ఆయాపార్టీల్లో అంతర్గత కలహాలు వస్తాయని కేసీఆర్ నమ్మిక. పార్టీ అభ్యర్దుల ఎంపిక విషయంలో తాము పారదర్శకంగా ఉన్నామని ప్రజలకు తెలియజేయలన్నది కేసీఆర్ ల‌క్ష్యం. ఈ వ్యూహంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు కలసి పోటి చేస్తే ఎలా ఎదుర్కోవాలో కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అరభ్యర్దుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు చెబుతున్నారు.

కేంద్రంలో బిజేపితో సఖ్యంగా ఉన్నందు వల్ల తెలంగాణలో ఆ పార్టీనుంచి పెద్దగా పోటి ఉండదని కేసీఆర్ ఆలోచన. ఒక విధంగా బిజేపితో లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ఎన్నికల బరిలో దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీ స్ధాయిలో బిజేపీ నాయ‌కులతో మంత‌నాలు సాగిస్తున్న‌ట్లు చెబుతున్నారు. బిజెపి ప్ర‌ధాన కార్యద‌ర్శి ముర‌ళీధ‌ర రావు - టిఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కుడు కె.కేశ‌వ‌రావు ఈ ప‌నిలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. లోపాయికారిగా ఎవ‌రికి ఎక్క‌డ మ‌ద్ద‌తు ఇవ్వాలి అనే అంశంపై వారు చ‌ర్చించిన‌ట్లు చెబుతున్నారు.