Begin typing your search above and press return to search.
జంపింగ్ ఎంపీకి పదవి రెడీ చేస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 4 Feb 2018 4:28 AM GMTగుత్తా సుఖేందర్ రెడ్డి...కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి..టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై పోరాటం చేసి...అనంతరం గులాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఓ సారి....కాదు కార్పొరేషన్ చైర్మన్ అని మరోసారి..ఇలా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు..రైతు సమన్వయ సమితికి చైర్మన్ గా చేయనున్నారని టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే..ఆ విషయంలో స్పష్టత రాకపోవడం..నిరీక్షణ పర్వంతో గుత్తా వర్గీయుల్లో ఆందోళన కనిపించింది. అయితే ఎట్టకేలకు గులాబీ దళపతి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
రైతు సమన్వయ సమితి పేరుతో తన కలల ప్రాజెక్టును ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇందుకు సంబంధించిన మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటుకానున్న రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ తరహాలో పనిచేస్తుందని ప్రకటించారు. దానికి ఒక ఉన్నతాధికారిని నియమించే అవకాశముందన్నారు. సహజంగానే కార్పొరేషన్ కు అధికారితో పాటు చైర్మన్ ఉంటారు. ఆ చాన్స్ గుత్తాకే దక్కవచ్చని అంటున్నారు. దీంతో గుత్తా నిరీక్షణకు తెరపడుతుందని విశ్లేషిస్తున్నారు.
గ్రామస్థాయి - మండల స్థాయి రైతు సమన్వయ సమితులకు తోడుగా జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు ఆయా జిల్లాల మంత్రులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లా సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత గ్రామ - మండల - జిల్లాస్థాయి సమితులతో రాష్ట్రంలో నలుదిక్కులా నాలుగు ప్రదేశాలలో సదస్సులను నిర్వహించాలని సూచించారు. అన్ని స్థాయిల సమన్వయ సమితులతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఆహార కల్తీ నిరోధానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి, పంటల మద్దతు ధర సాధనకు ఏం చేయాలి అనే విషయంపై అధ్యయనానికి మంత్రుల సబ్ కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ - రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు - వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా - పంటల పెట్టుబడి పథకం తదితర అంశాలపై మంత్రులు - ఎంపీలు - ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతు సమన్వయ సమితుల సభ్యులు గ్రామ సమన్వయ సమితులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ - ఎన్ని రకాల పంటలు - ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారనే విషయాలను తెలుసుకుంటారని, పంటల మార్కెటింగ్ - గిట్టుబాటు ధర కల్పించే విషయంలో బాధ్యత తీసుకుంటారని అన్నారు. రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని ఒకే విధమైన, నియంత్రించే పద్ధతిలో మార్కెట్ కు తేవాలని చెప్పారు. ఈ విషయంలో సమన్వయ సమితులు వారికి సూచనలిస్తాయన్నారు. ఏ మార్కెట్ కమిటీకి రోజువారీగా ఎంత ధాన్యం కొనుగోలు చేసే సామర్థ్యం ఉందో అంచనా వేసి, దానికి అనుగుణంగా రోజుకు కొందరు రైతుల చొప్పున తమ పంట తెచ్చుకొని అమ్ముకోవాలన్నారు. మార్కెట్‌లో అమ్మకం జరుగకపోతే రైతు సమన్వయ సమితి దాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతు సమన్వయ సమితుల పాత్ర నేపథ్యంలో మార్క్ ఫెడ్ పనితీరును పునర్నిర్వచించాలని సీఎం సూచించారు. వ్యవసాయరంగంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయే విషయంలో రైతు సమన్వయ సమితులు తమ వంతు పాత్ర పోషించాలని చెప్పారు.