Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ టీం రెడీ చేసుకుంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   26 Dec 2018 11:18 AM GMT
నేష‌న‌ల్ టీం రెడీ చేసుకుంటున్న కేసీఆర్
X
గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చిర‌కాల స్వ‌ప్నం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకుగాను దాన్ని ఏర్పాటుచేసే ప‌నిలో ఉన్నారు ప్ర‌స్తుతం ఆయ‌న‌. ఆ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే తాజాగా దేశ‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ఒడిశా సీఎం - బిజూ జ‌న‌తా ద‌ళ్ అధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌దిత‌ర నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. దేశ రాజ‌ధాని దిల్లీలోనే ప‌లువురు కీల‌క నేత‌ల‌తో భేటీకి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఓ వైపు దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీ నేత‌ల‌తో భేటీ అవుతూ బిజీగా ఉన్న కేసీఆర్‌.. మ‌రోవైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించేందుకుగాను ప్ర‌త్యేకంగా నేష‌న‌ల్ టీంను ఏర్పాటుచేసుకోవ‌డంపై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దేశ రాజ‌కీయాల‌ పై మంచి అవ‌గాహ‌న - ఆస‌క్తి క‌లిగి ఉండ‌టంతోపాటు త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్థులుగా ఉంటున్న‌ టీఆర్ ఎస్ నేత‌ల‌నే ఆయ‌న ఈ టీం లోకి తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

దేశ రాజ‌ధాని దిల్లీలో, ఇత‌ర రాష్ట్రాల్లో ప‌లు ప్రాంతీయ పార్టీలతో స‌మ‌న్వ‌య సాధ‌న కోసం కేసీఆర్ నేష‌న‌ల్ టీం ప‌నిచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయి నేత‌లు, కీల‌క ప్రాంతీయ పార్టీ నాయ‌కుల అపాయింట్ మెంట్ తీసుకోవ‌డం, చిన్న చిన్న పార్టీల‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌డం పై ఈ టీం స‌భ్యులు దృష్టిసారిస్తారు. వారంద‌రినీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గొడుగులోకి తీస‌కొచ్చేందుకు కృషిచేస్తారు.

కేసీఆర్ దిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌తిసారీ టీఆర్ ఎస్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ - పార్ల‌మెంట‌రీ పార్టీ నేత కె.కేశ‌వ‌రావు, గులాబీ ద‌ళం లోక్‌సభా ప‌క్ష నేత జితేంద‌ర్ రెడ్డి ఆయ‌న వెంటే ఉంటున్నారు. వీరిద్ద‌రికీ కేసీఆర్ నేష‌న‌ల్ టీంలో చోటు ఖాయం. వీరితోపాటు ఎంపీలు క‌విత‌, సంతోష్, కేసీఆర్ జాతీయ కార్య‌ద‌ర్శి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డి వంటి యువ‌నేత‌ల‌ను కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ టీంలోకి తీసుకోవాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం హ‌రీశ్ రావును కూడా ఈ టీంలోకి ఆయ‌న తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి కూడా ఈసారి మంత్రిమండ‌లిలో ఉండ‌ర‌ని.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసమే జాతీయ స్థాయిలో ఆయ‌న కృషిచేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో కేసీఆర్ టీంలాగే రాష్ట్ర స్థాయిలో త‌న కోసం కేటీఆర్ కూడా ప్ర‌త్యేక టీంను ఏర్పాటుచేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.