Begin typing your search above and press return to search.
మోడీ తర్వాత కేసీఆరే.. ఇంకో సంచలనానికి రెడీ
By: Tupaki Desk | 3 Feb 2019 7:50 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విభిన్న నిర్ణయాలు, ఆలోచన దోరణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను అనుకున్న పని ఏదైనా...ఖచ్చితంగా జరిగిపోవాలని భావించే కేసీఆర్ ఈ దఫా మరో ప్రత్యేక నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో బెడిసికొట్టిన తన కోరికను ఈ దఫా మరింత పకడ్బందీగా ఆయన నెరవేర్చుకోనున్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఆ స్థాయిలో పరిపాలన కలిగి ఉండే ముఖ్యమంత్రిగా ప్రత్యేకత సాధించనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే, దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణా బాధ్యతలను సహాయ మంత్రుల స్థాయిలో నియమించే నలుగురు పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులకు అప్పగించి వారికి ఒక్కో శాఖను కేటాయించడం!
గతంలో ఈ తరహా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించిన కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో అప్పట్లో నియమితులైన ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులు తమ పదవులను కోల్పోవలసి వచ్చింది. అయితే, ఈ దఫా అలాంటి ముప్పు రాకుండా చూసుకోవడంతో పాటుగా...ఆ పదవులకు మరింత ప్రత్యేకత జోడించేలా కేసీఆర్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ సాధారణ పరిపాలనాశాఖతో పాటు కీలకమైన సాగునీటి పారుదలశాఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖలను ఇతర మంత్రులకు కేటాయించకుండా తానే స్వయంగా నిర్వహిస్తానని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. సీఎంగా ఇటు ప్రభుత్వం, అటు పార్టీని నడిపించడంతో పాటు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించిన నేపథ్యంలో తన కార్యాలయంలో నలుగురు పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులను నియమించి వారికి ఒక్కో శాఖను అప్పగించాలన్న ప్రతిపాదనకు వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కార్యాలయంలో వ్యక్తిగత, పాలనాపరమైన పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమిస్తూ వస్తున్నట్లుగానే కేసీఆర్ సైతం సీఎంఓలో అదే తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై తనదైనశైలిలో కసరత్తు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలపై చర్చోపచర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుల్లో నలుగురిని తన కార్యాలయంలో నియమించుకోవాలని కేసీఆర్ ప్రతిపాదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్న కేసీఆర్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా విధానం అమల్లో లేదు. స్థూలంగా, ఈ నియామకాలతో జాతీయ స్థాయిలో తాను ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కూడా విస్తృతపరిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు ఓ ఆర్డినెన్స్ తెచ్చి ఈ పదవులను కేసీఆర్ కట్టబెట్టనున్నారని అంటున్నారు.