Begin typing your search above and press return to search.
తెలుగు సభల లెక్క కేసీఆర్ ఖాతాలోకి..!
By: Tupaki Desk | 5 Dec 2017 4:17 AM GMTతెలంగాణ అధికారపక్షంలో పని విభజన చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎవరేం పని చేయాలో ముందే డిసైడ్ అయిపోతుంది. ఎవరికి అప్పగించిన పనిని వారు పూర్తి చేయటం.. ఆ పనిలో మరెవరూ కల్పించుకోవటం మామూలే. మొన్నటికి మొన్నజరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవం.. జీఈఎస్ సదస్సునే చూస్తే.. ఈ రెండు కార్యక్రమాల నిర్వాహణ బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు.
ఇందుకోసం ఆయన తరచూ ఆ కార్యక్రమాల పనితీరును సమీక్షించటం.. అధికారులతో మాట్లాడటం చేశారు. మెట్రో రైలులో అయితే.. పలుమార్లు ప్రయాణించారు కూడా. ఇక.. జీఈఎస్ సదస్సును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే కాదు.. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు యుద్్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవటమే కాదు.. పనులు పరుగులు పెట్టించే విషయంతో తనకు సాటి మరెవరూ రారన్నట్లుగా వ్యవహరించారు.
ఈ రెండు సభలు విజయవంతంగా పూర్తి కావటం.. వాటి సక్సెస్ మంత్రి కేటీఆర్ ఖాతాలోకి వెళ్లిపోవటం జరిగిపోయాయి. ఇక.. మరో పది రోజుల్లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమం మొదలుకానుంది. ఈ కార్యక్రమ ప్రారంభానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ముగింపునకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు హాజరు కానున్నారు.
ఎల్ బీ స్టేడియం వేదికగా జరిగే ఈ వేడుకల నిర్వాహణ బాధ్యతల్ని కేసీఆర్ తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి 9 వరకు జరిగే వేడుకల్ని వైభవంగా నిర్వహించటంతో పాటు.. పలు కార్యక్రమాలతో జనరంజకంగా ఉండేలా చేయాలన్న ఆదేశాల్ని ఆయన జారీ చేశారు.
సభ బాధ్యతల్ని తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. స్టేడియంకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించారు. ప్రపంచ తెలుగు మహాసభల్ని అత్యంత వేడుకగా జరిపేందుకు వీలుగా కార్యక్రమాల్ని రూపొందించాలని.. ఎల్ బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి ప్రధాన హాలు.. మినీ హాలు.. ప్రివ్యూ థియేటర్.. తెలుగు యూనివర్సిటీ.. భారతీయ విద్యాభవన్..లలిత కళాతోరణం.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలలో సాహిత్య సభల్ని నిర్వహించాలని.. ఎక్కడా పార్కింగ్ సమస్యలు తలెత్తకూడదని కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణను చేపట్టిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరగనున్నట్లు చెబుతున్నారు. ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఏమేం సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న విషయాల్ని ప్రత్యేకంగా చెప్పారు. రెండు కార్యక్రమాల్ని సమర్థంగా పూర్తి చేసిన మంత్రి కేటీఆర్ కు మిన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగే తెలుగు ప్రపంచ మహాసభలు అత్యద్భుతంగా నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. పోటాపోటీగా కార్యక్రమ నిర్వాహణ తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.