Begin typing your search above and press return to search.

మళ్లీ కేబినెట్ ప్రక్షాళన..? కేసీఆర్ కు ఏమైంది?

By:  Tupaki Desk   |   24 Feb 2020 10:30 PM GMT
మళ్లీ కేబినెట్ ప్రక్షాళన..? కేసీఆర్ కు ఏమైంది?
X
తెలంగాణలో అన్ని ఎన్నికలు ముగిశాయి. సీఎం కేసీఆర్ ఇప్పుడు పాలనపై దృష్టి సారించారు. అయితే అంతా సామరస్యంగా సాగిపోతున్న దశలో మళ్లీ కేసీఆర్ కేబినెట్ ను షేక్ చేయబోతున్నాడన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. కనీసం నలుగురు మంత్రులను తొలగించబోతున్నాడని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కేబినెట్ లో ఈసారి మార్పులు తన రాజకీయ వారసుడు అయిన కేటీఆర్ కోసమే కేసీఆర్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే కేటీఆర్ సారథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు సాగాయి. త్వరలోనే కేటీఆర్ కు అధికారం దక్కబోతోందని ప్రచారం సాగింది. దానికి బలాన్ని చేకూరుస్తూనే కేటీఆర్ కు సన్నిహితులైన నలుగురికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని సమాచారం అందుతోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పటికే సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించారు. బీజేపీపై అందరు సీఎంలతో కూటమి కడుతానని అన్నారు. అతి త్వరలోనే అడుగులు పడొచ్చు అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మూడో ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చిన కేసీఆర్ దేశంలో మోడీకి మెజార్టీ రాకుంటే ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేవారు. కానీ వెళ్లలేకపోయారు. ఇప్పుడు కుమారుడికి రంగం సిద్ధం చేసేందుకు అతడి బ్యాచ్ ను ప్రభుత్వంలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.