Begin typing your search above and press return to search.

ఇదో చ‌రిత్ర‌.. జెడ్పీ ఎన్నిక‌ల్లో సారుది అదిరే రికార్డు

By:  Tupaki Desk   |   9 Jun 2019 6:14 AM GMT
ఇదో చ‌రిత్ర‌.. జెడ్పీ ఎన్నిక‌ల్లో సారుది అదిరే రికార్డు
X
ప‌ట్టు బిగించే అవకాశం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న సూత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నూటికి నూరుశాతం న‌మ్ముతారు. త‌న‌కు కాలం అనుకూలంగా లేన‌ప్పుడు ఎలా త‌గ్గి ఉంటారో.. క‌లిసి వ‌చ్చే కాలంలో చెల‌రేగిపోయే తీరును కేసీఆర్ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తాజా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయ‌ని చెప్పాలి. 32 జిల్లా ప‌రిష‌త్తులు.. 32 ఛైర్మ‌న్ ప‌ద‌వులు.. 32 వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు.. 64 కో ఆప్ష‌న్ ప‌ద‌వులు.. ఇన్ని ప‌ద‌వులు మొత్తంగా అన్ని గులాబీ సైన్యానికే ద‌క్క‌టం అపూర్వంగా చెప్పాలి.

రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ పాల‌క మండ‌ళ్ల‌లోని 128 ప‌ద‌వులు టీఆర్ ఎస్ కే సొంత‌మ‌య్యాయి. ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు ఒక్క‌రంటే ఒక్క‌రూ లేక‌పోవ‌టం చూస్తే.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధిక్య‌త సంపూర్ణ‌మే కాదు.. తిరుగులేనిదిగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 32 జెడ్పీల్లో 20 పాల‌క మండ‌ళ్ల‌కు మ‌హిళ‌ల నేతృత్వం వ‌హించ‌టం మ‌రో కీల‌కాంశంగా చెప్పాలి. అదే స‌మ‌యంలో అన్ని కులాల‌కు ప్రాధాన్య‌త ల‌భించ‌టం చూస్తే.. ఈ ఫ‌లితాలతో కొత్త రికార్డును కేసీఆర్ సృష్టించార‌ని చెప్పాలి.

రానున్న రోజుల్లో ఇదో చ‌రిత్ర‌లా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. వంద‌కు వంద శాతం ప‌ద‌వుల్లో జిల్లా ప‌రిష‌త్తు పాల‌క మండ‌ళ్ల‌ను గులాబీ పార్టీ కైవ‌శం చేసుకున్న తీరు అపూర్వ‌మ‌ని చెప్పాలి. ఈ అదిరే రికార్డును స‌మీప భ‌విష్య‌త్తులో బ్రేక్ చేసే పార్టీ తెలంగాణ‌లో ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జెడ్పీ ఎన్నిక‌ల్లో సారు క్రియేట్ చేసిన రికార్డు తెలంగాణ‌లో చెర‌గ‌ని ముద్ర‌ను వేయ‌ట‌మే కాదు.. గులాబీ పార్టీ ప‌ట్టు ఎంత‌న్న విష‌యాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.