Begin typing your search above and press return to search.

రేవంత్ చెప్పినా విన‌ను అంటున్న‌కేసీఆర్‌

By:  Tupaki Desk   |   7 Aug 2015 4:29 PM GMT
రేవంత్ చెప్పినా విన‌ను అంటున్న‌కేసీఆర్‌
X
"జాతీయ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా సత్‌ ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేయాలి. గ‌తంలో ఉన‌న ఈ సంప్ర‌దాయ‌ల‌ను పాటించాలి. వెంట‌నే ఈ దిశ‌గా సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు మొద‌లుపెట్టాలి " అని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు లేఖ రాశారు. తెలంగాణ జైల్ల‌లో మ‌గ్గుతున్న వంద‌లాద మంది ఖైదీల‌కు మోక్షం క‌లిగించాల‌ని రేవంత్ ఆ లేఖ‌లో విన్న‌వించారు.

అయితే రేవంత్ ప్ర‌త్యేకంగా విన్న‌వించిన నేప‌థ్యంలో తెలంగాణ సీఎం ఏ విధంగా స్పందిస్తార‌నే ఆస‌క్తి క‌లిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సత్ర్పవర్తన కలిగిన ఖైదీల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని స‌మాచారం. ఈ విష‌య‌మై హోంశాఖ ప్రాథ‌మిక క‌స‌ర‌త్తు కూడా పూర్తిచేయ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఖైదీల విడుదలపై సర్కార్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇప్ప‌టివ‌ర‌కు విడుదల చేయలేదు. దీంతో ఈసారి వేడుకలకు ఖైదీలు విడుదలయ్యే అవకాశం లేదని హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తంగా రేవంత్ చెప్పిన ప‌నికి కేసీఆర్ నో చెప్ప‌డం ఆస‌క్తిని కలిగించే ప‌రిణామమ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.