Begin typing your search above and press return to search.

కెసిఆర్ కే ప‌గ్గాలు.. అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవ ఎన్నిక‌..

By:  Tupaki Desk   |   25 Oct 2021 9:30 AM GMT
కెసిఆర్ కే ప‌గ్గాలు.. అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవ ఎన్నిక‌..
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి.. టీఆర్ ఎస్ అధినేత‌.. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. ఉర‌ఫ్ కేసీఆర్‌ మ‌రోసారి టీఆర్ ఎస్ పార్టీకి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో పార్టీ అధ్య‌క్షుడిగా.. కేసీఆర్ ఎన్నిక‌య్యారు. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా గులాబీ తోరణాలు కట్టడంతోపాటు కేసీఆర్‌, కేటీఆర్‌ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రధాన రహదారుల వెంట కటౌట్లు ఏర్పాటు చేయడం గ‌మ‌నార్హం.

ప్లీనరీ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇచ్చారు. కాగా, తొలిరోజు.. పార్టీకి అధ్య‌క్షుడిని ఎన్నుకునే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి ఎవ‌రూ పోటీ ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి కేసీఆర్ స‌హా.. ఆయ‌న కుమారుడు కూడా నామినేష‌న్ వేయొచ్చ‌నే ఊహాగానాలు సాగాయి. పైగా.. పార్టీ ప‌గ్గాలు కుమారుడికి అప్ప‌గిస్తే.. బెట‌ర్ అనే సంకేతాలు వ‌చ్చాయి. అయితే.. దీనికి భిన్నంగా పార్టీలో అధ్య‌క్ష ప‌ద‌వికి ఒకే ఒక నామినేష‌న్ దాఖ‌లైంది. దీంతో కేసీఆర్‌.. పార్టీ అధ్య‌క్షుడిగా మ‌రోసారి ప‌గ్గాలు చేప‌ట్టిన‌ట్ట యింది. ఇక‌, పార్టీ ఇప్పుడు కీల‌క ద‌శ‌లో ఉంద‌నే ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

2001లో టీఆర్ ఎస్ పార్టీ స్థాప‌న ద్వారా.. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మానికి జీవం పోసిన కేసీఆర్‌.. 14 సంవ త్సరాలు అలుపెరుగ‌ని పోరాటం ద్వారా.. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించార‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి.. రెండుటెర్మ్‌లు. అంటే.. దాదాపు ఏడేళ్లు పూర్తి. ఈ మొత్తం పాల‌న స‌మ‌యంలోనూ.. ఉద్య‌మం స‌మ‌యంలోనూ.. కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు..వేసిన అడుగులు న‌భూతో న‌భ‌విష్య‌తి. ప్ర‌త్యేక ఉద్య‌మం.. ప్ర‌త్యేక పాల‌న‌.. వంటివి కేసీఆర్‌కు రెండు ధ్రువాలుగా మారాయి. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో త‌న‌కు పోటీ రాగ‌ల పార్టీ లేకుండా చేసుకున్నారు.

ఇక‌, ఇప్పుడు పార్టీ నాయ‌కులు చెబుతున్న‌ట్టు.. ఒక కీల‌క ద‌శ‌. ఎందుకంటే.. ఇత‌ర పార్టీలు కూడా అధి కారం కోసం పుంజుకోవ‌డం.. ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ర్షించేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. వంటివి.. ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను మార్పుదిశ‌గా తీసుకువెళ్తున్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. కు మ‌రింత బాధ్య‌త పెరిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన పార్టీ తీరుకు భిన్న‌మైన మార్గంలో ఇప్ప‌టి నుంచి పార్టీని న‌డిపించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సో.. ఎలా చూసుకున్నా.. కేసీఆర్ ముందు.. పెద్ద బాధ్య‌తలే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.