Begin typing your search above and press return to search.

ఈ విష‌యంలో కేసీఆర్ ను మెచ్చుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   16 March 2019 4:30 AM GMT
ఈ విష‌యంలో కేసీఆర్ ను మెచ్చుకోవాల్సిందే!
X
ప్ర‌త్య‌ర్థిని దెబ్బ తీయ‌టం రాజ‌కీయాల్లో మామూలే. ఆ హ‌డావుడిలో దూరం ఆలోచించ‌కుండా.. లాజిక్ మిస్ కావ‌టం ఖ‌రీదైన పొర‌పాటే అవుతుంది. ఏళ్ల‌కు ఏళ్ల పాటు ఉన్న పార్టీని వ‌దిలేసి.. త‌మ పార్టీలోకి వ‌చ్చే వారి విష‌యంలో కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుంది. వ‌స్తాన‌న్న వారంద‌రిని వ‌చ్చేయ‌మ‌ని చెబుతారా? అంటే నో అనే చెప్పాలి. పార్టీలోకి వ‌స్తామ‌ని కోరిన వారి కంటే.. తాము గుర్తించి.. తీసుకుంటే మేలు జ‌రుగుతుంద‌ని భావించిన వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌న్న మాట మ‌రోసారి రుజువైంది.

తాజాగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన తెలుగు త‌మ్ముడు ఒక‌రు టీఆర్ ఎస్ లోకి జాయిన్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా మెలిగిన ఈ పారిశ్రామిక‌వేత్త క‌మ్ నేత‌.. గులాబీ కారులో ఎక్కేందుకు ప్లాన్ చేశారు. అంతేకాదు.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ బ‌రిలో నిలిచేందుకు వీలుగా పావులు క‌దుపుతున్నారు. త‌న ప్లాన్ లో భాగంగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ర‌హ‌స్య భేటీ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

తాను పార్టీలో చేరాల‌నుకుంటున్న‌ట్లు చెప్ప‌ట‌మే కాదు.. త‌న‌కు అవ‌కాశం ఇస్తే ఖ‌మ్మం లోక్ స‌భ స్థానానికి పోటీ చేస్తాన‌ని.. అందుకు అయ్యే ఖ‌ర్చు మొత్తం తానే చూసుకుంటాన‌ని చెప్పిన‌ట్లుగా తెలిసింది. స‌ద‌రు నేత మాట‌లు విన్న కేటీఆర్ వెంట‌నే కేసీఆర్ కు ఫోన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. స‌ద‌రు తెలుగు త‌మ్ముడ్ని పార్టీలో చేర్చుకునేందుకు కేటీఆర్ ఓకే అనేయ‌గా.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం నో చెప్పిన వైనం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ద‌రు నేత గురించి త‌న‌కు తెలుస‌ని.. ఆయ‌న్ను పార్టీలో అకామిడేట్ చేయ‌లేమ‌ని.. ఆయ‌న్ను పార్టీలోకి తీసుకుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆయ‌నకు ఎలాంటి హామీ ఇవ్వ‌కుండా వెన‌క్కు పంపాల‌న్న ఆదేశాల్ని కేసీఆర్ జారీ చేసిన‌ట్లు చెబుతున్నారు. తండ్రి మాట‌తో అవాక్కుఅయిన కేటీఆర్..మ‌రోమాట మాట్లాడ‌కుండా వెన‌క్కు పంపిన‌ట్లుగా తెలుస్తోంది. కేసీఆరా మ‌జాకానా?