Begin typing your search above and press return to search.
ఇక్కడ ఒక్క స్థానం డబ్బుతో.. అవతల ఓ రాష్ట్రం పొందొచ్చు: నిందితులు.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 4 Nov 2022 4:31 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం వచ్చి దొరికిపోయిన ముగ్గురు నిందితుల ఫుల్ వీడియోను నిన్న కేసీఆర్ చూపించారు. దాదాపు 3 గంటల ఈ వీడియోలో ఒక గంట పాటు కట్ చేసి మరీ వినిపించారు. ఇందులో ఎన్నో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
అమిత్ షా పేరు 20 సార్లు, 2 సార్లు మోడీ పేరు వినిపించింది. ఇక ఇదంతా బీఎల్ సంతోష్ అనే బీజేపీ కోఆర్డినేటర్ చేస్తున్నాడని.. ఇదంతా ఎలా చేస్తున్నామన్నది కూడా క్లియర్ కట్ గా రికార్డ్ చేశారు.
మొత్తంగా ఈ ఎపిసోడ్ లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణలోనే కాదు.. బీజేపీ కూల్చిన 8 రాష్ట్రాలను ఎలా కూల్చామన్నది కూడా ఈ నిందితులు పూసగుచ్చినట్టు చెప్పడం విశేషం. ముంబైలో రిసార్ట్ లో ఉండి మరీ ఏక్ నాథ్ షిండే తో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చామని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే రాజకీయాలు చాలా ఖరీదైనవి ఫాంహౌస్ నిందితులు పేర్కొన్నారు. 'ఇక్కడ తెలంగాణ, ఏపీలో ఒక్క నియోజకవర్గానికి మేం పెట్టే ఖర్చుతో కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఎన్నికలు పూర్తి చేయొచ్చు. అదే డబ్బుతో ఇంకొన్ని చోట్ల 7-8 స్థానాలు మేం పొందగం' అంటూ తెలుగు రాష్ట్రాల సీట్లు ఎంతో ఖరీదైనవో ఈ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది.
ఇక తెలంగాణ తర్వాత ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలను తాము కూల్చబోతున్నట్టు ఈ నిందితులు స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపెట్టడం విశేషం. దీన్ని బట్టి ఈ ముఠా కేవలం తెలంగాణలోనే కాదు.. దేశమంతా ఈ ఆపరేషన్లు చేస్తారని.. వీరి వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్న విషయం అర్థమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.