Begin typing your search above and press return to search.
చిన్నారెడ్డిని కేసీఆర్ తిట్టినట్లా?.. పొగిడినట్లా?
By: Tupaki Desk | 14 Nov 2017 3:45 AM GMTతెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర అంశాలకు కొదవలేదు. విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్.. పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాతావరణాన్ని హాట్ హాట్ గా మార్చేశారు. ఇలాంటి వేళ.. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపక్షంలో ఉన్నప్పటికీ కొందరు నేతలపై పొగిడేసే అలవాటున్న కేసీఆర్.. తాజాగా తన దృష్టి చిన్నారెడ్డి మీద పెట్టారు. ఆయనపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తూనే.. పొగిడేయటం ఈసారి ప్రత్యేకతగా చెప్పాలి. రైతుల సమస్యలపై చిన్నారెడ్డి మాట్లాడిన నేపథ్యంలో.. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.
తన మాటల్లో ఎన్నికల ప్రస్తావన తెచ్చిన చిన్నారెడ్డి మాటలకు స్పందించిన ఆయన.. ఎందుకో చిన్నారెడ్డిగారికి ఎన్నికలంటే భలే తొందరగకున్నది. అరవై నెలలు పాలించమని ప్రజలు మాకు చెప్పారు. ఇప్పటికి 40 నెలలు మాత్రమే అయ్యింది. "ఆంధ్రా.. తెలంగాణ విభజన లొల్లి.. కేంద్ర ఉత్తర్వులు.. ఇలాంటి పంచాయితీలు పోయి మాకున్న సమయంలో వీలైనన్ని కార్యక్రమాలు చేశాం* అని అన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు మరో 20 నెలల సమయం ఉందని.. తమకున్న తక్కువ వ్యవధిలో పలు కార్యక్రమాలు చేశామని.. అలాంటి ప్రభుత్వం మరొకటి ఉండన్నారు. చిన్నారెడ్డి తమకు మిత్రుడని..ఆయన మంత్రి పదవి కోసం తాను కోట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. చిన్నారెడ్డిని తప్పుపడుతూనే..ఆయన్ను పొగిడేసిన కేసీఆర్.. మంత్రి పదవికి చిన్నారెడ్డి అర్హుడని వ్యాఖ్యానించటం గమనార్హం.