Begin typing your search above and press return to search.

రోడ్డున పడేస్తావా మోడీ జీ.. కేసీఆర్ ఆవేదన?

By:  Tupaki Desk   |   21 April 2020 7:10 AM GMT
రోడ్డున పడేస్తావా మోడీ జీ.. కేసీఆర్ ఆవేదన?
X
కరోనా వైరస్ తో విధించిన లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. రాష్ట్రాలకు దమ్మిడి ఆదాయం లేక ఆర్థికంగా కుదేలయ్యాయి. భారీ ఆదాయనష్టాన్ని చవిచూస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్రానికి - మోడీకి సూచించారు. అయితే అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్టు తెలిసింది. తన విలువైన ఆర్థిక సలహాలను పట్టించుకోని ప్రధాని నరేంద్రమోడీ ఉదాసీన వైఖరిపై కేసీఆర్ తన ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం..

తాజాగా కేబినెట్ భేటిలో ఈ మేరకు కేసీఆర్ కేంద్రం - మోడీ తీరుపై తనదైన శైలిలో విసర్లు కురిపించినట్టు తెలిసింది. ‘హెలికాప్టర్ మనీ లేదా క్వాంటిటేటివ్ ఈజింగ్ అమలు కోసం ప్రధానికి తాను సూచించానని.. హెలికాప్టర్ మనీ ఇవ్వకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మనీ.. ఏవిధంగానైనా రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరానని’ కేసీఆర్ అన్నారట.. ఆర్థిక విధానం కేంద్రం చేతిలో ఉంటుందని.. రాష్ట్రాలకు సాయం విషయంలో తమ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారట..

అయితే ప్రధాని - కేంద్రం హెలిక్యాప్టర్ మనీపై పెడచెవిన పెట్టడం పై కూడా కేసీఆర్ భేటిలో హాట్ కామెంట్స్ చేశారట.. కేంద్రం తన సూచనలు పాటించాల్సిన అవసరం లేదని.. కొత్త ఆర్థిక విధానంతో వచ్చి రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని.. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదని.. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంలో రాష్ట్రాలకు కేంద్రం తోడ్పాటునందించాలని కేసీఆర్ అన్నట్టు తెలిసింది.

ఈ మేరకు ఎఫ్ ఆర్బీఎం నిబంధనలు సడలించడం.. రాష్ట్రాలను రుణాలను వాయిదా వేయాలని ప్రధాని మోడీని ఫోన్ లో కోరినట్టు కేసీఆర్ తెలిపారు. ఇక ధాన్యం కొనుగోళ్ల లావాదేవీలపై వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్బీఐని కోరానని కేసీఆర్ తెలిపారట..

లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ఏప్రిల్ నెలలో 15వేల కోట్లకు పైగా ఆదాయం కోల్పోయిందని కేంద్రం వెంటనే ఆదుకోకపోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమని తెలిపారట..

ఇలా తెలంగాణలో లాక్ డౌన్ తో వాటిల్లిన ఆర్థికనష్టం.. ఆర్థిక వ్యవస్థ దిగజారిన వైనంపై తాజా కేబినెట్ భేటిలో కేసీఆర్ కళ్లకు కట్టినట్టు వివరించాడట.. కేంద్రం కనుక ఆదుకోకపోతే తెలంగాణ పరిస్థితి పూర్తిగా దిగజారడం ఖాయమన్న ఆందోళన కేసీఆర్ లో నెలకొంది.