Begin typing your search above and press return to search.
నీళ్ల కోసం కేసీఆర్ ఫోన్ చేశారు
By: Tupaki Desk | 10 July 2015 9:37 AM GMTఏపీతో నిత్యం పంచాయితీలు పెట్టుకున్నట్లుగా కనిపించే తెలంగాణ రాష్ట్ర సర్కారు.. తన ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మరో నాలుగు రోజుల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నప్పటికి.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నీళ్లు లేక పుష్కర ఘాట్లు వెల వెలబోతున్నాయి. వర్షాలు సరిగా లేకపోవటం.. ఎగువ రాష్ట్రాల్లోని అదే పరిస్థితి ఏర్పడటంతో వరద జలాలు రాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కరస్నానం చేసే ధర్మపురిలోనూ నీళ్లు కనిపించని పరిస్థితి.
ఈ విషయం మీద ఇప్పటికే మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే.. పుష్కరాలు ముంగిట్లోకి వచ్చిన తర్వాత కానీ తెలంగాణ రాష్ట్ర సర్కారు మేలుకున్నట్లు కనిపించటం లేదు. తాజాగా మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. పుష్కరాల నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కోరారు.
ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. గవర్నర్‌లకు ఫోన్ చేసిన నీళ్లు వదిలే విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ వినతిని మహారాష్ట్ర సర్కారు సాయంత్రం లోపు అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే.. నీళ్లు వదిలితే.. పుష్కరాల సమయానికి గోదారమ్మ కాస్తం జలకళను సంతరించుకునే వీలుంది. ఇలాంటి ప్రయత్నం మరికొంత ముందుగా తెలంగాణ సర్కారు చేపడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.