Begin typing your search above and press return to search.
కేసీఆర్ వినతి:నిధులు..50 మందిని ఇవ్వండి
By: Tupaki Desk | 29 Oct 2015 4:39 AM GMTకేంద్రం దగ్గరకు ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు నిధులు అడగటం మామూలే. అయితే.. నిధులతో పాటు భారీగా అధికారుల్ని అడిగి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మార్క్ చూపించారు. ఐఎఎస్ లు.. ఐపీఎస్ లను రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తుంది.
అయితే.. పెద్ద ఎత్తున కేటాయించటం జరిగే పని కాదు. అందుకే.. కేసీఆర్ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు యాభై మంది సివిల్ సర్వీసు అధికారుల్ని తమ రాష్ట్రానికి కేటాయించాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు.
తన తాజా వినతికి అవసరమైనన్ని కారణాల్ని కేంద్రానికి చూపించారు కేసీఆర్. ప్రస్తుతం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తర్వలో మరో 14 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయనున్నామని.. ఇందుకు తగిన పాలనా సిబ్బంది అవసరమని చెప్పుకొచ్చారు. అందుకే.. 50 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు కావాలన్న డిమాండ్ ను కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు అదనంగా 14 జిల్లాలు కలవటం కారణంగా మొత్తంగా 24 జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రం మారనుంది.
అయితే.. ఇంత పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీసెస్ అధికారుల్ని ఒకే రాష్ట్రానికి కేటాయించటం సాధ్యమయ్యే పనేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ అధికారుల కొరత తీవ్రంగా నెలకొన్న సమయంలో ఒక రాష్ట్రానికే దాదాపు యాభై మందిని కేటాయించటం అంత తేలిక కాదంటున్నారు. అయితే.. తన డిమాండ్ ఏమీ పెద్దది కాదన్న విషయాన్ని కేసీఆర్ తనదైన వాదనతో కేంద్రం వద్ద వివరించినట్లుగా చెబుతున్నారు.
అధికారుల్ని కేటాయించాలన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటల్ని.. అదే పార్టీకి చెందిన ఎంపీ వినోద్ కుమార్ మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని చూస్తే.. ‘‘తెలంగాణలో ఐఎఎస్.. ఐపీఎస్ అధికారులు తగినంతగా లేరు. రాష్ట్రంలో పది జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఒక జిల్లాగా ఉంది. అక్కడ జనాభా కోటి దాటింది. ఐదారు జిల్లాలతో సమానమైన జనాభా హైదరాబాద్ లో ఉన్నా నలుగురైదుగురు ఐఎఎస్ లు.. ఐపీఎస్ లు మాత్రమే ఉన్నారు. జనాభా పరంగా చాలా తక్కువగా ఉన్నారు. మాకు కేటాయించాల్సిన అధికారుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. హర్యానాలో20 జిల్లాలకు సరిపడా సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు. కానీ తెలంగాణలో ఆ రాష్ట్రం మూడో వంతే. త్వరలో తెలంగాణలో జిల్లాల్ని పెంచుతున్న నేపథ్యంలో 50 నుంచి 60 మంది వరకు కొత్త అధికారల అవసరం ఉంది’’ అని కేంద్రానికి చెప్పినట్లుగా వెల్లడించారు. నిధుల విషయంలో సమర్థవంతమైన వాదనను వినిపించి.. తమ పథకాలకు కేంద్రం నిధులను తెచ్చుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన కేసీఆర్.. హర్యానా పేరు చెప్పి అధికారుల్ని రాష్ట్రానికి తెచ్చుకోవాలన్న వాదన విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో కొద్ది కాలంగా వెయిట్ చేస్తే తెలుస్తుందేమో.