Begin typing your search above and press return to search.

కేసీఆర్ మార్క్.. లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్

By:  Tupaki Desk   |   17 Sep 2021 5:38 AM GMT
కేసీఆర్ మార్క్.. లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్
X
అంచనాలకు అందని రీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల కాలంలో దళితులకు దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టి.. అందరూ తెలంగాణ వైపు చూసేలా చేసిన ఆయన.. తాజాగా మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొనటం సంచలనంగా మారింది.

మద్యం షాపుల్లో గౌడ కులస్థులు.. ఎస్సీలు.. ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనను సీఎం కేసీఆర్ ఆవిష్కరించటమే కాదు.. త్వరలో జరిగే మద్యం టెండర్ల నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. గౌడ కులస్థులకు 15 శాతం.. ఎస్సీలకు 10 శాతం.. ఎస్టీలకు 5 శాతం చొప్పున షాపుల్ని కేటాయిస్తామని కేబినెట్ భేటీ సందర్భంగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్లు మంత్రివర్గం సైతం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అంతేకాదు.. ఇటీవల కాలంలో ఇబ్బందికరంగా మారిన పోడు భూముల సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని కేబినెట్ నిర్ణయించింది.

ఎప్పటిలానే సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసిన అంశాలు ఇవే

- ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులకు రూ.100 కోట్ల కేటాయింపు.

- రాష్ట్రంలో కురిసిన వర్షపాతం.. వానాకాలంలో మొత్తంగా సాగైన భూమి వివరాలు. పంట రాబడి.. దిగుమతి అంచనాలతో పాటు మార్కెటింగ్ శాఖ సన్నద్ధత ఎలా ఉందన్న అంశంపై ఆరా.

- రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివ్రద్ధిపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలి. తదుపరి మంత్రివర్గ భేటీలో చర్చించాలి.

- హైదరాబాద్ లోని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి విద్యా సంస్థ వినతితో నారాయణగూడలోని 1261గజాల స్థలాన్ని బాలికల హాస్టల్ గా నిర్మాణానికి ఓకే

- కరోనా మూడు దశ వస్తే.. దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి

- వైద్య ఆరోగ్య వసతుల విస్తరణకు చేపట్టిన నాలుగు కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.. కొత్త వైద్య కళాశాలలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి.

- ఆక్సిజన్ కొరత నివారణకు 550 మెట్రిక్ టన్నులకు పెంచాలి

- రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా అదుపులో ఉంది. విద్యా సంస్థలు తెరిచిన తర్వాత కూడా వైరస్ కేసుల్లో పెరుగుదల ఉంది. చిన్న పిల్లలకు మహమ్మారి వస్తే పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.

- అన్ని రకాల ఔషధాలు.. ఆక్సిజన్.. టెస్టు కిట్లు.. టీకాలు అందుబాటులో ఉంచాలి. ఇప్పటివరకు 2.56 కోట్ల డోసులు వేశారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం ప్రత్యేకంగా 5200 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు.

- రూ.133 కోట్లతో పడకలు.. మందులు.. ఇతర సామాగ్రి సమకూర్చుకున్నాం.

- కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పోలీస్ స్టేషన్ లోని సమస్యలు.. అవసరాలను సమీక్షకు హోంమంత్రిమహమూద్ అలీ తో పాటు మంత్రులు హరీశ్.. శ్రీనివాస్ గౌడ్.. జగదీశ్ రెడ్డి.. కొప్పుల ఈశ్వర్.. ప్రశాంత్ రెడ్డి.. ఇంద్రకరణ్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి.. పువ్వాడఅజయ్ కుమార్ లు సభ్యులుగా ఉంటారు.

- ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రులు హరీశ్.. ప్రశాంత్ రెడ్డి.. తలసాని.. జగదీశ్.. నిరంజన్ రెడ్డి.. సబితారెడ్డి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు.

- సంగారెడ్డి..ఆందోళు.. జహీరాబాద్.. నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 20 టీఎంసీలతో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర.. బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం. ఈ రెండింటికి నాబార్దు ద్వారా రుణాలు తీసుకోవాలన్న నిర్ణయం.