Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ ఏం చెప్పిండు భయ్..
By: Tupaki Desk | 8 Jan 2016 4:33 AM GMTఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం.. ఆ నిర్ణయాలపై హైకోర్టుకు వెళ్లటం.. వాటిని విచారించిన కోర్టు.. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని తప్పుపట్టటం కొత్త విషయాలేం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు షురూ అయిన నాటి నుంచి ఇలాంటి ఎన్నో అనుభవాలెన్నో. తాజాగా గ్రేటర్ ఎన్నికల్ని స్వల్ప వ్యవధిలో నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకోవటం.. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న నిబంధనల్లో మార్పులు తీసుకురావటం తెలిసిందే. దీన్ని హైకోర్టు తప్పు పట్టి.. ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చిన నేపథ్యంలో.. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.
ఎన్నికల్ని కుదిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నతీరు చూస్తే.. ఆయన తెలివితేటలకు మురిసిపోవాల్సిందే. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను కుదించుకోవటానికి కేసీఆర్ చెప్పిన భాష్యం ఏటంటే.. గ్రేటర్ ఎన్నికల కారణంగా ఎన్నికల విధుల్లో దాదాపు లక్ష మంది వరకు జీహెచ్ ఎంసీ ఉద్యోగులు నెల రోజులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని.. దీని కారణంగా హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందన్న ఉద్దేశ్యంతోనే కుదింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఎన్నికల కారణంగా అన్నేసి రోజుల పాటు ఉద్యోగులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉంటే హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోతే.. ఎంత నష్టం అని కేసీఆర్ చెప్పటం చూసినప్పుడు ఆయన కమిట్ మెంట్ కు ముచ్చటేయక మానదు. కాకుంటే.. తాను తలపెట్టిన అయుత చండీయాగం కారణంగా దాదాపుగా పది రోజుల పాటు రాష్ట్ర యాంత్రాంగం మొత్తం యాగం పనుల్లో మునిగి తేలిన విషయం బహిరంగ రహస్యం. పెద్దపెద్ద ఐఎఎస్ లు.. ఐపీఎస్ లు సైతం దీక్షా వస్త్రాల్ని ధరించి భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఫోటోల్ని అంత త్వరగా మర్చిపోలేరు. మరి.. యాగం కారణంగా పది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర సర్కారు స్తంభించి పోతే ఇదే కేసీఆర్ కు ఎందుకు పట్టనట్లు? గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి ఎన్నికల కారణం ఎక్కడ ఆగిపోతుందో అన్న ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్.. యాగం లాంటి వాటి కారణంగా ప్రభుత్వ పనులు నిలిచిపోయిన వైనం ఆయనకు ఎందుకు గుర్తుకు రాదో..?