Begin typing your search above and press return to search.
పెద్దనోట్ల రద్దుతో ‘కేసీఆర్’ కు నష్టం ఎంతంటే?
By: Tupaki Desk | 15 Nov 2016 4:50 AM GMTమిగిలిన ముఖ్యమంత్రుల సంగతేమో కానీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న ఆందోళన అంతాఇంతా కాదు. ప్రధాని నోటి నుంచి పెద్దనోట్ల రద్దు మాట బయటకు వచ్చిన పక్క రోజున కీలక నేతలు.. అధికారులతో కలిసి గవర్నర్ తో భేటీ అయిన ఆయన.. ప్రధాని తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టం ఎంత? ఏ మేర ప్రభావం చూపుతుందన్న అంశంపై సుదీర్ఘంగా సమీక్ష తరహాలో అభిప్రాయ సేకరణ జరిపినట్లుగా చెబుతారు.
కేంద్రం కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి నష్టం పక్కా అన్న మాటను అప్పట్లోనే స్పష్టం చేసిన ఆయన.. రోజులు గడిచే కొద్దీ.. నోట్ల రద్దుపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. సోమవారం సంగతే చూస్తే.. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ గవర్నర్లు అయిన వేణుగోపాల్.. దువ్వూరి సుబ్బారావులతో మరికొందరు ఆర్థిక నిపుణులతో తాజా పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా కరెన్సీ రద్దు కారణంగా జరగనున్న నష్టం ఎంతన్న అంశంపై గడిచిన మూడు రోజులుగా వివిధ వర్గాల నిపుణులతో చర్చలు జరుపుతున్న ఆయన.. తనకు (తెలంగాణ రాష్ట్రానికి) జరిగే నష్టం ఎంతన్న అంశంపై ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
కరెన్సీ రద్దుతో కేంద్రం గెలిచి.. రాష్ట్రాన్ని ఓడించిందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మనీకి చెక్ చెప్పేందుకు రద్దు చేసిన పెద్దనోట్ల కారణంగా ప్రతి నెలా రూ.1000 కోట్ల వరకూ తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లటం ఖాయమని లెక్క తేల్చారు. కరెన్సీ రద్దు కారణంగా జరిగే నష్టం కనీసం రెండేళ్ల పాటు సాగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక రంగంపై రెండేళ్లు ఉంటుందని.. ఈ అంశంపై పెద్ద ఎత్తున మేథోమధనం చేసిన కేసీఆర్.. త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
పెద్దనోట్ల రద్దుకు సంబంధించి రాష్ట్రానికి జరిగే నష్టంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వానికి వివిధ అంశాలకు సంబంధించి పడి ఉన్నబకాయిల్ని వసూలు చేసుకునేందుకు పాత నోట్లను తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు చెబుతున్నారు. భూముల రెగ్యులరైజేషన్ తోపాటు కరెంటు.. నల్లా బిల్లులు.. పట్టణ.. నగర.. గ్రామ పంచాయితీల్లో ఆస్తిపన్ను వసూళ్లకు పాత నోట్లను తీసుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే.. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రానికి జరిగే నష్టంతో పాటు.. రానున్న రోజుల్లో దీని ప్రభావం రాష్ట్ర సర్కారు మీద ఉంటుందన్న విషయంపై కేసీఆర్ పూర్తి అవగాహనకు వచ్చినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/