Begin typing your search above and press return to search.

భూముల ర‌చ్చ‌పై కేసీఆర్ మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   14 Jun 2017 4:20 AM GMT
భూముల ర‌చ్చ‌పై కేసీఆర్ మాటలు విన్నారా?
X
సంచ‌ల‌నం సృష్టించిన హైద‌రాబాద్ భూమ‌ల వ్య‌వ‌హారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. గ‌డిచిన కొద్ది కాలంగా రాజ‌కీయంగా ర‌చ్చ ర‌చ్చగా మారి.. ప‌లువురు నేత‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తూ.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారిన ఈ ఇష్యూపై కేసీఆర్ ఉన్న‌త స్థాయి రివ్యూ జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడిన కేసీఆర్‌.. ఈ ఇష్యూ మీద త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఈ ఉదంతం స్కామ్ ఎంత మాత్రం కాద‌ని.. మీడియాలో ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగా కుంభ‌కోణ‌మేమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ ఎపిసోడ్ లో ఖ‌జానాకు ఒక్క రూపాయి కూడా న‌ష్టం జ‌ర‌గ‌లేద‌న్న ఆయ‌న‌.. రిజిస్ట్రేష‌న్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిపిన వారిపై చ‌ర్య‌లు తీసుకున్న నేప‌థ్యంలో సీబీఐ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని తేల్చేశారు.

ప్ర‌భుత్వ భూముల రిజిస్ట్రేష‌న్ల‌పై అక్ర‌మాలు జ‌రుగుతున్న సంగ‌తి తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. ఈ ఉదంతంపై కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అవ‌క‌త‌వ‌క‌ల్ని బ‌య‌ట‌పెట్టింది తామేన‌ని.. త‌మ ప్ర‌భుత్వం ఈ ఇష్యూ మీద చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. మొద‌ట్లో ఈ అంశంపై ఫాలో అప్ చేసింది కేటీఆరే అయినా.. తాజాగా మాత్రం కేసీఆర్ టేక‌ప్ చేయ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వానికి రూపాయి కూడా న‌ష్టం వాటిల్ల‌లేద‌ని చెబుతున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

రివ్యూలో కేసీఆర్ చెప్పిన మాట‌ల్ని చూస్తే..

= జాగీర్ భూముల‌పై హ‌క్కుప‌త్రాలు సృష్టించుకొని ప్ర‌భుత్వ భూముల్ని కాజేసే ప్ర‌య‌త్నాల్ని అన్ని కోణాల నుంచి ఎదుర్కొంటాం. అవ‌స‌ర‌మైన న్యాయ‌పోరాటం చేస్తాం. ఒక్క గ‌జం ప్ర‌భుత్వ స్థ‌లం కూడా పోకుండా చూసే బాధ్య‌త ప్ర‌భుత్వానిది. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికే నేరుగా వివ‌రాలు పంపి.. కేసు విచార‌ణ‌లో పూర్వాప‌రాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేలా చేస్తాం.

= జాగీరు భూముల‌పై ప్ర‌భుత్వానికి త‌ప్ప ప్రైవేటు వ్య‌క్తుల‌కు ఎలాంటి హ‌క్కులు ఉండ‌వు. జాగీరు భూములు ర‌ద్దు అయిన‌ప్ప‌టికీ వాటిపై హ‌క్కులున్న‌ట్ఉల‌గా ప‌త్రాలు సృష్టించే ప్ర‌య‌త్నం కొంద‌రు చేస్తున్నారు. వారికి కొంద‌రు స‌బ్ రిజిస్ట్రార్లు స‌హ‌క‌రిస్తున్నారు. అలాంటి వారిని ఉపేక్షించం. ఎంత‌టి వారినైనా శిక్షిస్తాం.

= మియాపూర్‌.. బాలాన‌గ‌ర్‌.. ఇబ్ర‌హీంప‌ట్నం.. శంషాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో వెలుగులోకి వ‌చ్చిన భూమంతా ప్ర‌భుత్వ ఆధీనంలో ఉంద‌ని కేసీఆర్‌కు అధికారులు చెప్ప‌గా.. ఈ విష‌యంపై నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రపాల‌ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/