Begin typing your search above and press return to search.
నయిం ఇష్యూ పై కేసీఆర్ రియాక్ట్ అయినట్లేనా?
By: Tupaki Desk | 16 Aug 2016 4:50 AM GMTఊహించని పరిణామం ఏదైనా జరిగినప్పుడు.. ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించటం సహజం. జరిగిన ఘటన వివరాలు వెల్లడించి.. జరుగుతున్న దర్యాప్తును వివరిస్తారు. తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తారు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తాయి. గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ ఇష్యూ మీద ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. హోంమంత్రి మాత్రమే కాదు.. అత్యున్నత పోలీసు అధికారులు ఎవరూ మాట్లాడింది లేదు. నయిం ఏమైనా చిన్న చితకా వ్యక్తి కానే కాదన్న విషయం ఎన్ కౌంటర్ అనంతరం వెలుగు చూస్తున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.
మరింత జరుగుతున్నా.. ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? నయిం నేర చరిత మీదా.. అతడి వైఖరి మీద సంచలన విషయాలు వెలుగు చూస్తున్న వేళ.. ఈ విషయాల మీద మరింత లోతుగా విచారణ జరిపిస్తామని.. బాధితులపై చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని ఉన్నత పోలీసు అధికారులే కాదు.. కీలక నేతలు కూడా కామెంట్ చేయని పరిస్థితి.
నయిం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నేత మాట్లాడింది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం చాలా పొడి..పొడిగా.. నయిం ఎన్ కౌంటర్ ను రాజకీయం చేయొద్దని.. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారని.. నయిం ఆరాచకం వెనుకున్న వారిని నిగ్గు తేలుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే తెలంగాణ హోం మంత్రి సైతం ఆచితూచి స్పందించారే కానీ..పెద్దగా మాట్లాడింది లేదు.
ఇదిలా ఉండగా.. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట మీద నుంచి ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నయిం ఇష్యూమీద తొలిసారి పెదవి విప్పారు. నేరుగా ప్రస్తావించని ఆయన.. ఈ అంశంపై పరోక్ష వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘రాష్ట్రంలో అరాచక శక్తుల ఆట కట్టిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు కృత నిశ్చయంతో.. దృఢచిత్తంతో చర్యలుతీసుకుంటున్నాం. ఆ ఫలితాలు మీ కళ్ల ముందే కనిపిస్తున్నాయ్. ప్రత్యేక తెలంగాణలో పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడిందని చెప్పటానికి సంతోషిస్తున్నాం. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టటానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలకు యావత్ జాతి గర్విస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు నయిం ఎపిసోడ్ గురించేనని.. దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? నయింతో సంబంధాలు ఉన్న వారి విషయంలో తమ ప్రభుత్వం ఎలా వ్యవహరించనున్నదన్న విషయాన్ని కేసీఆర్ తన మాటలతో స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు.