Begin typing your search above and press return to search.
ఇక కొత్త కేసీఆర్ ను చూస్తారట
By: Tupaki Desk | 6 Aug 2017 8:20 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ తన పంథాను మార్చుకోనున్నారని చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కాస్త సంయమనం పాటించి గులాబీ దళపతి ఇకనుంచి తన పూర్వపు రీతిలో విరుచుకుపడనున్నారని అంటున్నారు. గతంలో తనపై వచ్చే విమర్శలకు ఘాటుగా స్పందించిన రీతిలో ఇకనుంచి రియాక్ట్ అవనున్నారట. అందులోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పై ఈ దూకుడు కొనసాగనుందని తెలుస్తోంది. నీళ్లు - నిధులు - నియామకాల నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లి విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి క్రమంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందంటూ బహిరంగంగా విమర్శలకు దిగిన సీఎం కేసీఆర్ - కాంగ్రెస్ వైఖరిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పర్యటనా వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్టు కనిపిస్తోంది.
ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నప్పటికీ, అధికార పక్షం ఇప్పటి నుంచే దూకుడు ప్రదర్శిస్తోంది. తెలంగాణలో జరిగిన అన్ని ఉపఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అధికారపక్షం దూకుడుగా వెళ్లి విజయం సాధించగా, ప్రతిచోట పరాజయం పాలు కావడంతో కాంగ్రెస్ నిరాశలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని మరింత కునారిల్లేలా చేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారనేది ముఖ్యమంత్రి ప్రధానమైన ఆరోపణ. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి అంశంపైనా కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ కేసులు వేయడం లేదని పీసీసీ అధ్యక్షుడు - సీఎల్పీ నాయకుడు ప్రకటించగా - మంత్రులు - టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - మండలి సభ్యులు కేసులు వేసిన కాంగ్రెస్ నేతల పేర్లను కూడా ప్రకటించారు. గత ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసిన పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయి ఇప్పుడు కేసులు వేస్తున్నారన్న వాదనతో జాబితాను బయటపెట్టారు.
ఇక తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు పది పన్నెండు ఉంటే, ప్రయోజనం పొందే జిల్లాలు ఆరేడుంటాయి. కాంగ్రెస్ ముంపు గ్రామాలపై దృష్టిసారిస్తే, అధికార పక్షం తెరాస ప్రాజెక్టులు పూర్తికావడం వల్ల ప్రయోజనం కలిగే జిల్లాలపై దృష్టిసారిస్తోంది. ఈనెల 10న పొచంపాడులో తెరాస నిర్వహించనున్న బహిరంగ సభలో కాంగ్రెస్ కేసుల తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇదే విధంగా అన్ని ప్రాజెక్టుల వద్దా బహిరంగ సభలు నిర్వహించి - కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో తెరాస కనిపిస్తోంది. పోచంపాడు సభ విజయవంతం చేసేందుకు తెరాస ఇప్పటికే కసరత్తు మొదలెట్టింది. ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం పొందే గ్రామ ప్రజల నుంచి మద్దతు సాధించడానికి తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఏవిధంగా ప్రయత్నిస్తోందో వివరించనున్నారు. పోచంపాడు సభతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోర్టు కేసులతో అభివృద్ధిని అడ్డుకుంటోందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లనుడటం ద్వారా ఆ పార్టీని దోషిగా నిలబెట్టడం కేసీఆర్ వ్యూహమని స్థూలంగా చెప్తున్నారు.