Begin typing your search above and press return to search.
తిరుగుటపాలో కేసీఆర్..అసలేం జరిగింది?
By: Tupaki Desk | 28 May 2018 2:09 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. నాలుగు రోజుల పాటు అక్కడే ఉండేందుకు, ప్రధామంత్రి నరేంద్రమోడీ సహా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ హఠాత్తుగా నగరానికి తిరుగు పయానమయ్యారు. ఆరోగ్య సమస్యల విషయంలోనూ ఆయన వైద్య సహాయం పొందనున్నారనే వార్తలకు దూరం పెడుతూ కేసీఆర్ ఇలా తిరుగు పయనం అవడం ఆసక్తికరంగా మారింది.
విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జోనల్ విధానంపై ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేయించిన కేసీఆర్ వెంటనే దాని ప్రతిని తీసుకొని స్వయంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విధానంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోడీని కలిసి కొత్త జోనల్ విధానం అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పును కోరే తీర్మానాన్ని అందజేస్తారని, రాష్ట్రపతి ద్వారా ఆమోదం ఇప్పించాలని కోరతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు అంశాలు, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటి ఇతర అంశాలపైనా ప్రధానితో కేసీఆర్ చర్చించే వీలుంది. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కేసీఆర్ కలవనున్నారని, ప్రధానితో కేసీఆర్ సమావేశం మంగళవారం ఉండే వీలుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి దంత వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటారని టీఆర్ఎస్ వర్గాల వెల్లడించాయి.
అయితే, దీనికి భిన్నంగా కేసీఆర్ ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రమే తిరుగు పయనం అయ్యారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. హోంమంత్రితో పలు అంశాలను చర్చించిన అనంతరం ఆయన నగరానికి వచ్చారు. అయితే ఈ ట్విస్ట్ వెనుక కారణం...ప్రధాని అపాయింట్‌మెంట్ నిరాకరించడమే కారణమని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాలను ప్రశ్నిస్తూ ఫెడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్న అనంతరం ఆయన చేసిన మొదటి టూర్ ఇలా అకస్మాత్తుగా మలుపులు తిరగడం ఆసక్తికరంగా మారింది.
కాగా, ఢిల్లీ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోడీ రెండు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నందున అపాయింట్ మెంట్ కుదరలేదు. రెండు రోజులు ఇండోనేషియా - సింగపూర్ లలో ప్రధాని పర్యటించనున్నారు. మలేసియాలోనూ ప్రధాని అనధికార పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో మోడీ ఆయా దేశాధినేతలతో పాటుగా పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌తో ప్రధాని భేటీ కుదరలేదు.