Begin typing your search above and press return to search.
ఫాంహౌస్ నుంచి సిటీకి తిరిగొచ్చిన కేసీఆర్
By: Tupaki Desk | 14 Feb 2019 5:39 AM GMTదేశంలో మరే రాష్ట్రంలో లేని రాజకీయం తెలంగాణలో కనిపిస్తుంది. అన్నింటికి మించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు మిగిలిన వారికి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. సచివాలయానికి రాకపోవటం.. రాజధానిని వదిలి కాస్త దూరంలో ఉన్న తన ఫాంహౌస్ కు వెళ్లటం.. అక్కడే రెండు.. మూడు రోజులు ఉండిపోవటం లాంటివి చేస్తుంటారు.
ఆయన ఎప్పుడు ఫాంహౌస్ కు వెళతారో.. ఎప్పుడు సిటీకి తిరిగి వస్తారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే సమాచారం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి.. ఒక్క మంత్రితో రెండు నెలలుగా సర్కారు బండి లాగిస్తున్న కేసీఆర్.. మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న ఆశలు గులాబీ నేతల్లో చాలానే ఉన్నాయి.
అయితే.. అలాంటి ఆశల మీద ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తున్న కేసీఆర్.. ఫలానా రోజున మంత్రివర్గం పక్కా.. ఎందుకంటే ఆ రోజు ముహుర్తం అదిరిందంటూ మీడియాలో వచ్చిన వార్తల పుణ్యమేమో కానీ.. ఆయన మంత్రివర్గ విస్తరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి ఫాంహౌస్ కు వెళ్లిపోయారు.
దీంతో.. పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారంతా నిరుత్సాహానికి గురైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా సిటీకి తిరిగి వచ్చేశారు కేసీఆర్. దీంతో గులాబీ నేతల్లో సరికొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రోజు (ఫిబ్రవరి 14)తో పాటు.. శని.. ఆది.. సోమవారాలు మంచి రోజులు కావటం.. ఆ తర్వాత పెద్దగా ముహుర్తాలు లేవన్న మాట వినిపిస్తోంది. ముహుర్తాలు.. జాతకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అలవాటు ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఈ వారాంతంలో మంత్రివర్గ విస్తరణతోపాటు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల టికెట్లను కన్ఫర్మ్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి.. గులాబీ నేతల ఉత్సాహానికి తగ్గట్లేకేసీఆర్ నిర్ణయాలు ఉంటాయా? లేక.. తనకు అలవాటైన వాయిదా పర్వాన్ని కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. ఏమైనా ఫాంహౌస్ నుంచి సిటీకి కేసీఆర్ వచ్చారన్న మాటతో గులాబీ దళంలోఆనందోత్సాహాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.