Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సమీక్ష
By: Tupaki Desk | 21 Aug 2021 5:00 AM ISTతెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అక్కడే ప్రారంభం అయ్యింది. సీఎం కేసీఆర్ అక్కడి నియోజకవర్గంలో నిర్వహించే ఉప ఎన్నికపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దళితబంధు సహా కీలక పథకాలను హుజూరాబాద్ కు కేటాయిస్తున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం బహిరంగ సభ అనంతరం పరిణామాలు, ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించిన కేసీఆర్.. ఆయన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజాభిప్రాయాన్ని అంచనావేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందనేది లెక్కలు కడుతున్నాయి.