Begin typing your search above and press return to search.
అయ్యో.. పండుగ పూట సారు చేత రివ్యూ పెట్టించారే?
By: Tupaki Desk | 28 Oct 2019 4:57 AM GMTమరీ ఆరాచకం కాకపోతే ఏమిటండి? ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న అధినేతను దీపావళి పండుగపూట సరదాగా మనమళ్లు.. మనమరాళ్లతో కలిసి పిండివంటలు.. పటాసులతో సెలబ్రేట్ చేసుకోనివ్వకుండా ఈ సమ్మె లొల్లి ఏందండి? యూనియన్ నాయకులతో మాట్లాడే స్థాయి తనదా? అంటూ తనకున్న స్థాయి ఏమిటన్న విషయాన్ని విలేకరుల సమావేశం సాక్షిగా తెలంగాణతోపాటు.. అశేష తెలుగు ప్రజలకు తానేమిటన్న విషయాన్ని చెప్పేసిన కేసీఆర్ సార్ లాంటి పెద్ద మనిషికి కష్టం కలిగేలా వ్యవహరించటం ఏమిటండి?
సరిగ్గా పండుగ వెళ్లిపోయిన తెల్లారే హైకోర్టుకు.. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన ఉండటంతో పండుగపూట అన్ని పనుల్ని పక్కన పెట్టేసి వేడుకలకు పరిమితం కావాల్సిన పెద్ద మనిషి చేత.. అధికారుల్ని ఇంటికి పిలిపించుకొని మరీ రివ్యూ పెట్టేసి.. కోర్టుకు ఏం చెప్పాలన్న దానిపై ప్లాన్ సెట్ చేసేలా చేయటం వెనుక ఎంత దుర్మార్గం ఉంది సుమండి.
తాను కోరుకున్నట్లుగా చేసే అధికారాన్ని తెలంగాణ ప్రజలు ఐదేళ్ల పాటు దఖలు చేసిన వేళ.. ఆ విషయంలో ఉన్నకొద్దిపాటి అనుమానాల్ని హుజూర్ నగర్ ఉప ఎన్నికతో తీర్చేసిన నేపథ్యంలో.. మీరేం చేసినా ఫర్లేదు కేసీఆర్.. ఎన్ని వేల మంది ఉద్యోగాల్ని తీసేసినా.. ఆర్టీసీని ప్రైవేటీకరించి పారేసినా.. చైతన్యానికి ప్రతిరూపాలనైన సంఘాల్ని మడతపెట్టి గోదాట్లో కలిపేసినా.. కిక్కురమనకుండా.. కరతాళ ధ్వనులతో స్వాగతించేసిన హుజూర్ నగర్ ఓటర్ల తీర్పును చూస్తే.. పండుగ వేళలో సారుకు కష్టం కలిగించటానికి మించిన పాపం మరేం ఉంటుంది చెప్పండి. పెద్దమనిషి ఇగోను హర్ట్ చేయకుండా.. ఆయన మనసు దోచి పనులు పూర్తి చేసుకోవాలి. దీనికి కూడా హుజూర్ నగర్ వాసులు ఎంత తెలివైనోళ్లో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మీక్కావాల్సింది మేం ఇస్తాం.. మాక్కావాల్సింది మీరు ఇవ్వండన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసి.. రూ.100 కోట్లకు పైనే ప్రభుత్వ నిధులు రానున్న కొద్ది రోజుల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పారుతాయన్న భరోసాను సారు ఇచ్చేశారు. ఇలానే.. కేసీఆర్ మనసును దోచుకోవాల్సింది పోయి.. కయ్యానికి కాలుదువ్వితే.. ఆర్టీసీ కార్మికుల మాదిరే పరిస్థితి ఉంటుంది. ఏమైనా.. పండుగ వేళ హ్యాపీగా వేడుకలు చేసుకోవాల్సిన స్థానే.. రివ్యూ మీటింగ్ పెట్టుకునేలా చేసిన దానికి సారు.. బదులుతీర్చుకోక తప్పదంటున్నారు. మరి.. సారులాంటి పెద్దోళ్లకు అసౌకర్యం కలిగిస్తే ఎలా?