Begin typing your search above and press return to search.
పెద్ద నోట్ల రద్దుపై మోడీకి ఫోన్ చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 17 Nov 2016 3:57 PM GMTపెద్ద నోట్ల రద్దు దేశంలో కొందరికి సంతోషాన్ని ఇస్తుంటే...మరికొందరికి ఆగ్రహాన్ని కల్పిస్తుంది. ఇదే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మోడీ ఈ నోట్లను రద్దు చేసిన వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను మోడీకి గతంలోనే ఈ సలహా ఇచ్చానని చెప్పారు. ఇక కేసీఆర్ దీనిపై ముందునుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే గురువారం కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుపై సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ సామాన్యుల వద్ద రెండున్నర లక్షలకు పైగా డబ్బులుంటే వాటిని బ్లాక్ మనీగా భావించరాదని సూచనలు చేశారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్ లో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన ఇబ్బందులను కేసీఆర్ మోడీకి వివరించారు.
ఇక కేసీఆర్ మోడీని ఫోన్లో అపాయింట్ మెంట్ కోరగా మోడీ శుక్రవారం తాను ఢిల్లీలో ఉంటానని...వచ్చి కలవాలని కేసీఆర్ కు సూచించారు. ఇక ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున శుక్ర లేదా శనివారాల్లో మోడీని కేసీఆర్ మీట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ మోడీకి వివరిస్తారని సమాచారం.
ఇక అధికారుల సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ నోట్ల రద్దు ప్రభావం రిజిస్ట్రేషన్ - రవాణా - ఎక్సైజ్ - సేల్స్ టాక్స్ - కమర్షియల్ టాక్స్ పైనా ప్రభావం కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గినందున కేంద్రానికి చెల్లించే అప్పుల గడువును వాయిదా వేయాలని ఆయన మోడీని కోరనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/