Begin typing your search above and press return to search.
కరోనాపై కేసీఆర్ రివ్యూ.. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 10 Jan 2022 4:30 AM GMTభయం అక్కర్లేదని చెబుతూనే.. అశ్రద్ధ చేయొద్దన్న విన్నపం.. అన్ని అందుబాటులో ఉన్నాయ్.. ఇబ్బందులు లేవని చెబుతూనే.. ఎవరిళ్లలో వారు ఉండాలన్న సూచన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వేళ..పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రగతిభవన్ లో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా..ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళలో.. కరోనా వ్యాప్తి ఏ తీరులో ఉందన్న విషయాన్ని మంత్రి హరీశ్ తో కలిపి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపు ఇచ్చిన కేసీఆర్.. కరోనా పట్ల ప్రజలు ఏ మాత్రం అశ్రద్ధ చూపించొద్దన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు సిద్ధం చేశాం. ఆక్సిజన్, బెడ్స్ , మందులు వంటి ఎలాంటి కొరత లేదు. కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వండి. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి’’ అని చెప్పారు.
రివ్యూలో.. ఈసారి సంక్రాంతి పండగను ఎలా చేసుకోవాలన్న విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.కేసులు పెరుగుతున్న వేళ.. సంక్రాంతి పండగ వేళ ప్రజలు గుంపులు.. గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లల్లో వారు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను జరుపుకోవాలన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని.. దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఉండాలన్నారు. సోమవారం నుంచి పెద్ద వయస్కులకు.. హెల్త్ కేర్ వర్కర్లకు.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. కరోనాకు సంబంధించిన రివ్యూతో.. థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారని చెప్పాలి.