Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బయోపిక్ లో కేసీఆర్ అలా కనిపిస్తారా?
By: Tupaki Desk | 13 Sep 2018 7:30 AM GMTప్రాంతాలు వేరైనా.. తెలుగోళ్లంతా ఒక్క విషయంలో ఏకమయ్యే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే.. అది ఎన్టీవోడే. తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టటమే కాదు.. మద్రాసీలు వేరు.. తెలుగువారు వేరన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశాడు. తెలుగోడి పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పటమే కాదు.. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిన నేతగా చెప్పక తప్పదు.
ఎన్టీఆర్ మైండ్ సెట్.. ఆయన తరహా రాజకీయాలు ఇవాల్టి రోజున ఊహించటం కూడా కష్టమే. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ లాంటి ప్రముఖ నటి నటించటం ఒక ఎత్తు అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ లో సన్నివేశ పరంగా వచ్చే పలువురు ప్రముఖుల పాత్రల కోసం భారీ ఎత్తున తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. ఇటీవల కాలంలో మరే సినిమాలోనూ కనిపించనంత స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను చూపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇంతకీ.. ఎన్టీఆర్ బయోపిక్ లో కేసీఆర్ పాత్ర.. సన్నివేశం ఎలా ఉంటుందన్న దానిపై వస్తున్న సమాచారం ప్రకారం.. తన కుమారుడు కేటీఆర్ ను వెంట పెట్టుకొని ఎన్టీఆర్ వద్దకు కేసీఆర్ వస్తారని.. ఆ సన్నివేశంలో కేసీఆర్ పాత్రను ఒక ప్రముఖ నటుడు పోషిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతానికి రీల్ కేసీఆర్ ఎవరన్న దాన్ని రహస్యంగా ఉంచాలని చిత్ర బృందం భావిస్తోంది.
వ్యక్తిగతంగా.. రాజకీయంగా ఎన్టీఆర్ ను విపరీతంగా అభిమానించే కేసీఆర్.. తన కొడుకు పేరును తారకరామారావుగా పెట్టుకోవటానికి కారణం ఇదేనని చెబుతారు. మరి.. ఈ విషయాన్ని ఎంత ఎఫెక్టివ్ గా చూపిస్తారన్నది చూడాలి. ఇదిలా ఉంటే..అక్కినేని పాత్రను ఆయన మనమడు సుమంత్ పోఫిస్తున్నారు. ఏఎన్నార్ గా కనిపించే పాత్ర షూటింగ్ కోసం అక్కినేని చివర ప్రయాణించిన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకొని వెళ్లినట్లుగా సుమంత్ వెల్లడించారు. తాత అక్కినేని పాత్రలో తాను కనిపించటం చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ పై అంతకంతకూ పెరుగుతోన్న ఆసక్తికి తగ్గట్లే.. నటుల ఎంపిక ఉందని చెప్పకతప్పదు