Begin typing your search above and press return to search.
కారు ఖాతాలో కొడంగల్ !?
By: Tupaki Desk | 4 Dec 2018 3:25 PM GMTతెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో అధికారం తెలంగాణ రాష్ట్ర సమితి తొలి విజయం దక్కినట్లే. అదేమిటీ పోలింగ్ పూర్తి కాకుండానే ఓట్ల లెక్కింపు జరగకుండానే తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా విజయం సాధించింది అనుకుంటున్నారా...!? ఆ విజయం ఏ నియోజకవర్గం నుంచి దక్కిందని ఆలోచిస్తున్నారా.!? తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాలక, ప్రతిపక్షాలు భావిస్తున్నది కొడంగల్ నియోజకవర్గమే. రాజకీయ పార్టీల మధ్య పోరులా కాకుండా వ్యక్తిగత యుద్దంలా కొడంగల్ ఎన్నిక రూపాంతరం చెందింది. అక్కడ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టుదలగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దిగా మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి సోదరుడు నరేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన విజయాన్ని ఖాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు హరీష్ రావు, కేటీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదంతా ఒక వైపు.
మరో వైపు రేవంత్ రెడ్డి కూడా తన గెలుపుపై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కొడంగల్‌లో రాజకీయ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు బహిరంగ సభ నేపథ్యంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు ప్రభావం టీఆర్‌ఎస్ సభపై ఉంటుందని, సభకు పెద్దగా జనాలు రారని మహాకూటమి భావించింది. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తు కేసీఆర్ సభకు లక్షలమంది హాజరయ్యారు. ఇది భవిష్యత్తు ఎన్నికలలో గెలుపునకు సూచిక అని టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమయ్యిందనే ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు కొడంగల్ ప్రచార సభలో కేసీఆర్ కూడా ప్రత్యర్ది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది పార్టీ విజయానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌కి రెండు రోజుల ముందే కొడంగల్ విజయం కారు ఖాతాలో పడనట్లేనని అంటున్నారు.