Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల క‌ల‌కు మోడీ బ్రేకులు వేసేసిన‌ట్లే

By:  Tupaki Desk   |   28 July 2017 3:36 AM GMT
చంద్రుళ్ల క‌ల‌కు మోడీ బ్రేకులు వేసేసిన‌ట్లే
X
అన్ని క‌ల‌లు తీర‌వు. ఆ విష‌యం కేసీఆర్‌కు అర్థ‌మైపోయింది. తానెంత కోరుకున్నా.. త‌న కోరిక‌ను తీర్చే విష‌యంలో ప్ర‌ధాని మోడీ సుముఖంగా లేర‌న్న విష‌యం కేసీఆర్ కు క్లారిటీ వ‌చ్చేసింది. ఆ విష‌యాన్ని త‌న‌దైన శైలిలో మీడియాకు చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో విప‌క్ష ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకొచ్చిన కేసీఆర్‌.. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విభ‌జ‌న చ‌ట్టంలోని అసెంబ్లీ సీట్ల‌ను పెంచుకోవ‌టం ద్వారా సీట్ల స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చ‌న్న క‌ల‌ను క‌న్నారు. నిజానికి ఈ క‌ల‌ను కేసీఆర్ మాత్ర‌మే కాదు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కూడా క‌న్నారు. అయితే.. ఇద్ద‌రు చంద్రుళ్ల క‌ల‌ను తీర్చ‌టం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. రెండు అధికార‌ప‌క్షాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌టానికి అవ‌కాశం ఇస్తుంద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న మోడీ.. సీట్ల పెంపున‌కు కేంద్రం రెఢీగా లేద‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

త‌న క‌ల‌ను సాధించుకునేందుకు నేరుగా కేసీఆరే ప్ర‌ధానిని కోర‌గా.. ఆయ‌న అందుకు నో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. విభ‌జ‌న చ‌ట్టంలో ఉంది కాబ‌ట్టే సీట్ల పెంపు గురించి అడిగామే త‌ప్పించి.. త‌మ‌కు పెద్ద తేడా ప‌డ‌ద‌న్న‌ట్లుగా మాట్లాడిన కేసీఆర్‌.. మోడీతో భేటీసంద‌ర్భంగా మ‌రోసారి సీట్ల పెంపు అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు.

నిజానికి సీట్ల పెంపు విష‌యంలో కేంద్రం వైఖ‌రి క్లారిటీ లేక‌పోవ‌టం..ఈ ఇష్యూ మీద‌ మోడీ అండ్ కోకు ఆస‌క్తి లేద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. ఆ విష‌యంపై స్ప‌ష్ట‌త తెచ్చుకునేందుకు ఆయ‌న్నే నేరుగా అడిగేసిన‌ట్లుగా తెలుస్తోంది. సీట్ల పెంపుపై త‌మ‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని.. కేంద్రం ఆలోచ‌న ఏమిట‌న్న సూటిప్ర‌శ్నను ప్ర‌ధానికి కేసీఆర్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు నిర్ణ‌యం తీసుకున్నా.. ఆ ఇష్యూ ముగిసేస‌రికి 2024 ఎన్నిక‌ల వ‌ర‌కూ స‌మ‌యం తీసుకుంటుంద‌ని కేసీఆర్ కు మోడీ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. దీనిపై విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. అంత స‌మ‌యం అక్క‌ర్లేద‌ని.. కేవ‌లం మూడు నెల‌ల స‌మ‌యం స‌రిపోతుంద‌ని కేసీఆర్ చెప్పినట్లుగా ఆయ‌నే చెప్పారు. సీట్ల పెంపు విష‌యం మీద తాను చెప్పిన విష‌యాన్నే ప‌దే ప‌దే ప్ర‌ధాని చెబుతున్నార‌న్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు లేన‌ట్లేన‌న్న విష‌యాన్ని కేసీఆర్ మీడియాతో తేల్చేశారు. సీట్ల పెంపు విష‌యంలో మోడీ సిద్ధంగా లేద‌న్న కేసీఆర్ మాట‌తో.. ఇద్ద‌రు చంద్రుళ్ల క‌ల‌ల‌కు మోడీ బ్రేకులు వేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.