Begin typing your search above and press return to search.

మోడీ డ‌బ్బులు వ‌ద్ద‌న్న కేసీఆర్!

By:  Tupaki Desk   |   6 July 2022 3:23 AM GMT
మోడీ డ‌బ్బులు వ‌ద్ద‌న్న కేసీఆర్!
X
కేసీఆర్ కూ మోడీకీ మ‌ధ్య యుద్ధం న‌డుస్తోంది. ఆ యుద్ధం కార‌ణంగా త‌రుచూ ఏవో వార్త‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.తాజాగా వ్య‌వ‌సాయ మీట‌ర్ల వివాదం మ‌రోసారి వెలుగు చూసింది. వాస్త‌వానికి తెలుగు రాష్ట్రాల‌లో ఉచిత విద్యుత్ విధానాన్ని చాలా వ‌ర‌కూ కేంద్రం వ్య‌తిరేకిస్తూనే ఉంది.

ఎందుకంటే ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని వారి భావ‌న. ఈ నేప‌థ్యాన ఆంధ్రాలో మాత్రం ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్ర‌త్యక్షంగా కాక‌పోయినా ప‌రోక్షంగా ఐదు వేల కోట్ల రూపాయ‌లు సాయం చేసింద‌ని వార్త‌లు వెల్లువెత్తాయి. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రం ఏం చెప్పినా ఔనంటున్నార‌ని కానీ తాము అలా కాదు అని టీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది.

అస‌లు తాము అధికారంలోకివ‌చ్చాక వ్య‌వ‌సాయానికి నిరాటంకంగా విద్యుత్ అందిస్తున్నామ‌ని, ఇప్పుడు మీట‌ర్లు బిగిస్తే రైతు అన్యాయం అయిపోతాడ‌ని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు.

ఈ ద‌శ‌లో మ‌రోసారి ఈ వివాదంకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే వెలుగు చూసింది. అదేంటంటే వ్యవ‌సాయానికి సంబంధించి వాడే మోటార్ల‌కు మీట‌ర్లు బిగిస్తే జీఎస్డీపీ ని 0.5 శాతం పెంచుతామ‌ని కేంద్రం చెప్పింద‌ని, అంటే రుణ ప‌రిమితిని కాస్త పెంచ‌డం ద్వారా తెలంగాణ‌కు ఆరు వేల వంద కోట్ల రూపాయ‌లు అద‌నంగా అప్పు వ‌స్తుంద‌ని, కానీ దీనిని కూడా తాము కాద‌నుకున్నామ‌ని టీఆర్ఎస్ అంటోంది.

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఏమంటున్న‌దంటే...

తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి టీ స‌ర్కారు తేల్చిచెప్పింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల(మోటార్ల)కు మీటర్లను బిగించేందుకు అంగీకరిస్తే రుణ పరిమితిని జీఎస్‌డీపీలో మరో 0.5 శాతం పెంచనున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.