Begin typing your search above and press return to search.
కేసీఆర్ అంత సీరియస్ గా చెబితే.. లైట్ తీసుకుంటే తిప్పలు తప్పవంతే
By: Tupaki Desk | 23 March 2020 5:30 PM GMTమార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని తేలిగ్గా తీసుకుంటున్న వారికి తిప్పలు తప్పట్లేదు. నిన్న సాయంత్రం.. మీడియా సమావేశాన్ని నిర్వహించిన వేళ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. రాష్ట్రం నలువైపులా ఉన్న సరిహద్దుల్ని క్లోజ్ చేస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు.
మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే.. చీమ.. దోమను కూడా పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలో అనుమతించమన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. అతిశయంగా అనిపించొచ్చు కానీ.. కేసీఆర్ మాటల్లో అర్థం ఏమిటంటే.. కరోనా వేళ తమ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉండనుందన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. వేరే రాష్ట్రాలకు చెందిన వాహనాల్ని ఎట్టి పరిస్థితుల్లో (అత్యవసరమైనవి కొన్నింటిని ప్రస్తావించి.. వాటికి మినహాయింపు ఉంటుందని చెప్పటం గమనార్హం) అనుమతించే ప్రసక్తే లేదని చెప్పేశారు.
ఇంతలా సీఎం కేసీఆర్ సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా ఆయన మాటల్ని లైట్ గా తీసుకొని పొద్దున్నే వాహనాలు వేసుకొని తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చిన వాహనాల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకుండా ఉండటంతో ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చేవారు సూర్యాపేట సరిహద్దు (కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న చెక్ పోస్టు) వద్ద తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
పెద్ద పెద్ద వాహనాలతో పాటు.. లారీలు.. కార్లను కూడా నిలిపివేశారు. ఏపీకి అలా వెళ్లి ఇలా తెలంగాణకు వచ్చే వారికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. వారాంతంలో ఏపీకి వెళ్లి.. సోమవారం ఉదయానికి సిటీకి చేరుకునేలా ప్లాన్ చేసినోళ్లంతా ఇప్పుడు తెలంగాణ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన పరిస్థితి. నిన్నటి ప్రెస్ మీట్ లో చెప్పిన తీరులోనే సీఎం తన మాటల మీద కఠినంగా ఉంటారా? చూసిచూడనట్లుగా కార్లను వదిలేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి సామాన్లు తీసుకొని వస్తున్న లారీ డ్రైవర్లకు.. వారి క్లీనర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి.. ప్రైవేటు వాహనాలు.. కార్ల సంగతి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సీఎం కేసీఆర్ మాటను లైట్ గా తీసుకుంటే ఇలాంటి తిప్పలు తప్పవు మరి.