Begin typing your search above and press return to search.

'సమతా' ప్రోగ్రామ్ లకు 'నమస్తే' పెట్టేశారుగా?

By:  Tupaki Desk   |   14 Feb 2022 3:30 AM GMT
సమతా ప్రోగ్రామ్ లకు నమస్తే పెట్టేశారుగా?
X
ముచ్చింతల్ లో శ్రీరామానుజుడి సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకున్న వేళలో.. అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో తెలంగాణ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థలో ఇచ్చిన ప్రయారిటీ.. దాని ప్రాధాన్యత అంతా ఇంతా కావు. చినజీయర్ర స్వామితో ప్రత్యేక ఇంటర్వ్యూలతో పాటు.. ఈ ప్రోగ్రాంకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

ఈ కార్యక్రమం కోసం రెండుసార్లు ప్రత్యేకంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి వివిధ విభాగాలకు చెందిన అధికారులకు స్వయంగా ఫోన్ చేసి పనులు పరుగులు తీయాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. వాటిని పట్టించుకోకుండా గంటల తరబడి.. ఒక ప్రైవేటు ప్రోగ్రాంకు సంబంధించిన ఏర్పాట్ల గురించి రివ్యూ చేయటం సీఎం కేసీఆర్ కే చెల్లుతుంది. తనకు నచ్చిన విషయంలో ఆయన ఎంత డీప్ గా వెళతారనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

అంతలా సమతా విగ్రహావిష్కరణ విషయాన్ని వ్యక్తిగత శ్రద్ధను ప్రదర్శించిన కేసీఆర్ కు.. తాజాగా చినజీయరర్ స్వామితోనూ.. అత్యంత ఆప్త మిత్రుడు మైహోం రామేశ్వరరావుతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్కలు తేడా వచ్చినట్లుగా చెబుతున్నారు.

తాను వ్యతిరేకిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ముచ్చింతల్ వచ్చిన సందర్భంలో ఆయన్ను చినజీయర్ స్వామిజీ పొగిడేసిన వైనం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కేసీఆర్ కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే.. గడిచిన రెండు.. మూడు రోజులుగా ముచ్చింతల్ లో జరుగుతున్న కార్యక్రమాల కవరేజ్ ను పూర్తిగా తగ్గించినట్లు చెబుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శనివారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తే.. దానికి సంబంధించిన కవరేజ్ గులాబీ బాస్ కు చెందిన దినపత్రికలో ఇచ్చిన ప్రయారిటీని చూసినోళ్లంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు.

మొన్నటి వరకు నిలువెత్తు పేజీల్లో కవరేజ్ ఇచ్చిన కార్యక్రమాన్ని.. ఇప్పుడు ఫోటో కూడా లేకుండా చేయటం చూస్తే.. కేసీఆర్ కు కోపం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనటానికి తాజా ఉదంతాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు.