Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆలోచన అదిరిపోయిందిగా!
By: Tupaki Desk | 2 March 2017 11:22 AM GMTనిజమే... కొత్త రాష్ట్రం తెలంగాణలో పాలన సరికొత్త పుంతలు తొక్కుతోంది. 14 ఏళ్ల పాటు విరామం లేని పోరాటం చేసిన టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేస్తూ తెలంగాణను కొత్త రాష్ట్రంగా అవతరించేలా చేశారు. కేసీఆర్ పోరాట పటిమను మెచ్చిన ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణకు తొలి సీఎం పదవిని ఆయనకే కట్టబెట్టారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పటికే రెండున్నరేళ్లు దాటిపోయింది. పదవిలోకి ఎక్కిన వెంటనే... ఉద్యమకారుడిగా ఉన్న ఆయనలోని మంచి పాలకుడు మేల్కొన్నారనే చెప్పాలి. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వెళుతున్న కేసీఆర్... పాలనలో ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగానే నిలుస్తున్నారు. గతేడాది దేశంలోనే ఉత్తమ సీఎంగా ఆయన అవార్డును కూడా అందుకున్నారు. అయినా కేసీఆర్ ఏం చేశారని ఆ అవార్డు ఇచ్చారని కొన్ని వర్గాలు ప్రశ్నించినా.. కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ప్రారంభమైన పలు పథకాలను చూస్తే... ఆ అవార్డుకు ఆయన అర్హుడేనని ఎవరైనా ఒప్పుకోక తప్పదు.
అంతేనా.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే క్రమంలో కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. వీటిలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒక్క కలం పోటుతో అప్పటిదాకా 10 జిల్లాలతో ఉన్న తెలంగాణను 31 జిల్లాలున్న పెద్ద రాష్ట్రంగా ఆయన చేసేశారు. అసలు కొత్త జిల్లాల అవసరం ఏమిటన్న ప్రశ్నకు కేసీఆర్ చెప్పిన సమాధానం విని జాతీయ మీడియా కూడా నోరెళ్లబెట్టిన వైనం మనకు తెలిసిందే. జిల్లాలు చిన్నగా ఉంటే... ఆ జిల్లాల్లోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టర్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుందని, అందుకే చిన్న జిల్లాల ఏర్పాటుకు తాను మొగ్గు చూపానని కేసీఆర్ నాడు చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కాస్త అటూ ఇటూగా కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వారి వారి ఎమ్మెల్యేలను మరింత చేరువ చేసేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వింటే... కేసీఆర్ ను వ్యతిరేకించే వారు కూడా ఆయనను మెచ్చుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
ఎమ్మెల్యేలు తమకు ఓట్లేసిన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు చాలా కారణాలుంటాయి. అయితే కారణాలతో సంబంధం లేకుండా ప్రతి ఎమ్మెల్యేను వారి నియోజకవర్గ ప్రజలకు చేరువ చేసేందుకు కేసీఆర్... నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు అధికారిక నివాసా (క్యాంపు ఆఫీసులు)లను ఏర్పాటు చేయాలని తలచారు. ఏకంగా ఒక్కో ఎమ్మెల్యే అధికారిక నివాసానికి కోటి రూపాయలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడేది లేదని కూడా ఆయన అధికారులకు చెప్పారు. దీనిపై కసరత్తు చేసిన అధికారులు సదరు నివాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... ఆగస్టులో తెలంగాణలోని 65 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల అధికారిక నివాసాల నిర్మాణం ప్రారంభం కాగా... ఆరు నెలల వ్యవధిలోనే చాలా ప్రాంతాల్లో వీటి నిర్మాణం పూర్తి అయ్యింది. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పరకాలలో నిర్మించిన ఎమ్మెల్యే అధికారిక నివాసం పూర్తిగా తయారైపోయింది. దీనిని నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ లాంఛనంగా ప్రారంబించనున్నారు.
కేసీఆర్ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో చెప్పడానికి.. ఈ ఎమ్మెల్యే అధికారిక నివాసంలోని వసతులు చూస్తేనే అర్థం అవుతోంది. పరకాల ఎమ్మెల్యే అధికారిక నివాసం విషయానికి వస్తే... 2,800 గజాల స్తలంలో 4,533 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో దీని నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినా... దీని నిర్మాణం... కేవలం రూ.68,92,448తోనే పూర్తి అయిపోయింది. రెండంతస్తుల్లో ఉన్న ఈ భవంతిలో మొదటి అంతస్తులో మీటింగ్ హాల్ - ఎమ్మెల్యే ఆఫీస్ - వీఐపీ లాంజ్ - గెస్ట్ రూం - పీఏల గదులు - రిసెప్షన్ - భద్రతా అధికారులకు గదులు ఉండగా, రెండో అంతస్తులో మాస్టర్ బెడ్ రూం - చిల్డ్రన్స్ బెడ్ రూం. డైనింగ్ కమ్ లివింగ్ రూం - జిమ్ - పూజ గది - వంట గది - డ్రాయింగ్ రూం - గెస్ట్ బెడ్ రూంలు ఉన్నాయి. ఇక భవనం మొత్తాన్ని సెంట్రల్ ఏసీగా మార్చేశారు. అంటే... ఎమ్మెల్యే గారి సొంతూరు నియోజకవర్గంలోని గ్రామంలో ఉన్నా... తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఈ అధికారిక నివాసంలోనే ఉండక తప్పదన్న మాట. అంటే నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నట్టేనన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/